‘స్మార్ట్‌ కిచెన్‌’లో విజి‘లెన్స్‌’ | - | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్‌ కిచెన్‌’లో విజి‘లెన్స్‌’

Feb 19 2026 9:53 AM | Updated on Feb 19 2026 9:53 AM

‘స్మా

‘స్మార్ట్‌ కిచెన్‌’లో విజి‘లెన్స్‌’

కడప అర్బన్‌ : కడప మున్సిపల్‌ హైస్కూల్‌ (మెయిన్‌) లోని స్మార్ట్‌ కిచెన్‌ లో అవకతవకలపై బుధవారం మధ్యాహ్నం విజిలెన్స్‌ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ స్మార్ట్‌ కిచెన్‌ నుంచి ప్రతిరోజు 2000 నుంచి 2500 మంది విద్యార్థులకు భోజనాలను పంపిస్తారు. మెనూ ప్రకారం పిల్లలకు అందించే కోడిగుడ్ల పరిమాణం సాధారణంగా 50 గ్రాముల బరువుతో ఉండాలి. అలాకాకుండా ఇక్కడ ఒక్కో గుడ్డు 35 గ్రాముల నుంచి 40 గ్రాముల మేరకు మాత్రమే బరువు కలిగి ఉన్నాయి. కాంట్రాక్టర్‌ తక్కువ బరువు ఉన్న గుడ్లను సరఫరా చేయడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.ఈ సందర్భంగా డీసీటీవో మాట్లాడుతూ స్మార్ట్‌ కిచెన్‌ తనిఖీలలో గుడ్ల పరిమాణం 50 గ్రాములు ఉండాల్సి ఉండగా కేవలం ఒక్కో గుడ్డు 35 నుంచి 40 గ్రాములు మాత్రమే ఉన్నాయని గుర్తించామన్నారు. ఈ వ్యత్యాసానికి సంబంధించి రిపోర్టును తయారుచేసి జిల్లా విద్యాశాఖ అధికారికి తదుపరి చర్యల కోసం పంపిస్తామన్నారు.తనిఖీలు చేసిన వారిలో డీసీటీవో గీతా వాణి, ఇన్‌స్పెక్టర్‌ శివన్న, ఏవో లక్ష్మణ్‌, కడప ఎంఈఓ ఇర్షాద్‌ తదితరులు ఉన్నారు.

వైభవంగా పుష్పరథోత్సవం

బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారి కల్యాణమహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం పుష్పరథోత్సవం వైభవంగా జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబలను పుష్పరధోత్సవంలో కందిమల్లా య్యపల్లెలో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు జరిగిన ఉత్సవాలు ముగిశాయి. మఠాధిపతి వెంకటాద్రిస్వామి ఆధ్వర్యంలో మేనేజర్‌ ఈశ్వరాచారి పర్యవేక్షణలో ఉత్సవాలు నిర్వహించారు.ప్రత్యేక అధికారి శంకర్‌బాలాజీ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

‘స్మార్ట్‌ కిచెన్‌’లో విజి‘లెన్స్‌’ 1
1/1

‘స్మార్ట్‌ కిచెన్‌’లో విజి‘లెన్స్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement