బ్రహ్మంగారి హుండీ ఆదాయం లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మంగారి హుండీ ఆదాయం లెక్కింపు

Feb 5 2026 7:36 AM | Updated on Feb 5 2026 7:36 AM

బ్రహ్మంగారి హుండీ ఆదాయం లెక్కింపు

బ్రహ్మంగారి హుండీ ఆదాయం లెక్కింపు

బ్రహ్మంగారి హుండీ ఆదాయం లెక్కింపు ఈశ్వరీదేవి మఠంలో వేలం పాట ఇంటర్‌ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలి క్యాన్సర్‌పై విజయం.. స్క్రీనింగ్‌తో సాధ్యం

బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపొతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో మఠాధిపతి వెంకటాద్రిస్వామి ఆదేశాల మేర కు బుధవారం 8 హుండీల కానుకలను లెక్కించగా రూ. 30.96లక్షలు నగదు వచ్చినట్లు మఠం మేనేజర్‌ ఈశ్వరాచారి తెలిపారు. 7గ్రాములు బంగారు, 221 గ్రాములు వెండి వచ్చినట్లు తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన సేవాసమితి మహిళలచే కానుకలను లెక్కించామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎండోమెంట్‌ ఏసీ శంకర్‌బాలాజీ, మఠం సిబ్బంది, ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణబ్యాంక్‌ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లి గ్రామంలోని ఈశ్వరీదేవిమఠంలో జిల్లా దేవదాయ శాఖ అధికారి శంకర్‌ బాలాజీ పర్యవేక్షణలో వివిధ విభాగాలకు సంబంధించి వేలం పాట నిర్వహించారు. కొబ్బరి చిప్పల సేకరణ హక్కుకు రూ. 2,60,000, పాదరక్షలు భద్రపరిచే హక్కుకు రూ.18,000, మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్వహణ, రుసుము వసూళ్ల కోసం రూ.1,77,000, అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలకు గాను రూ.3500 కలిపి వేలంపాటల ద్వారా మొత్తం రూ.4,58,500ల ఆదా యం వచ్చింది. కార్యక్రమాన్ని శ్రీ ఈశ్వరీదేవిమఠం కార్యనిర్వాహణాధికారి బీవీ జగన్మోహన్‌ రెడ్డి పర్యవేక్షించారు.

కడప ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్‌ థియరీ పరీక్షలను అధికారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని డీఆర్‌ఓ విశేశ్వరనాయుడు సూచించా రు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌ సభాభవన్‌లో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు అధ్యక్షతన జిల్లా అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 62 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సంబంధిత పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఈ థియరీ పరీక్షలను సజావుగా నిర్వహించుటకు సంబంధి త జిల్లా అధికారులు, సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, కేంద్రాల వద్ద శుభ్రత చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంటర్‌ ఆర్‌ఐఓ టీఎన్‌వీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ ఇంటర్‌ థియరీ పరీక్షలను 17,100 ప్రథమ సంవత్సర విద్యార్థులు, 16,564 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. పరీక్షల వేళ సమస్యలేమైనా ఉంటే విద్యార్థులు 08562– 244171 కు ఫోన్‌ చేయవచ్చని వివరించారు.

కడప రూరల్‌: స్క్రీనింగ్‌తో క్యాన్సర్‌ను గుర్తించి తొలినాళ్లలో వైద్య సేవలు పొందితే త్వరితగతిన కోలుకోవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నాగరాజు తెలిపారు. ప్రపంచ క్యాన్సర్‌ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం డీఎంహెచ్‌ఓ నాగరాజు ఆధ్వర్యంలో జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ఆరీఫుల్లా పర్యవేక్షణలో కడపలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి ఐటీఐ సర్కిల్‌ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన డాక్టర్‌ నాగరాజు మాట్లాడుతూ పొగాకు ఆల్కహాల్‌కు బానిసవటం, శారీరక శ్రమ లేకుండా ఎక్కువ మాంసాహారం, జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్ల క్యాన్సర్లు వచ్చే ప్రమాదముందన్నారు. ప్రభు త్వం క్యాన్సర్‌ నివారణ కోసం ఎన్‌సీడీ 4.0, ఇంటింటి సర్వే 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ చేస్తోందన్నారు. త్వరగా లక్షణాలను నిర్ధారణ, చికిత్స, ఫాలో అప్‌తో పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ ఉమామహేశ్వర్‌ కుమార్‌, ఎన్‌సీడీ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌, ఆర్‌బీఎస్‌కే ప్రో గ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అరిఫుల్లా, డెమో భారతి, డిప్యూటీ డెమో ప్రసన్న లత, రమేష్‌రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement