వరాలు కురిపించే మరియమాత | - | Sakshi
Sakshi News home page

వరాలు కురిపించే మరియమాత

Feb 5 2026 7:36 AM | Updated on Feb 5 2026 7:36 AM

వరాలు కురిపించే మరియమాత

వరాలు కురిపించే మరియమాత

కడప సెవెన్‌రోడ్స్‌: మరియమాత మహిళకు ఆదర్శవంతురాలని, ప్రేమ,దయ, కనికరం గల గుణవంతురాలైన ఆమెను భక్తిశ్రద్ధలతో పూజిస్తే వరాలు కురిపిస్తుందని పులివెందుల విచారణ గురువులు ఫాదర్‌ లక్కనేని ఆరోగ్యస్వామి అన్నారు. లూర్దు మాత మహోత్సవాల్లో భాగంగా మూడవ రోజు బుధవారం పాత చర్చి ఆవరణలో ఫాదర్‌ జి.దేవ సహాయం దివ్య బలి పూజ చేయగా ఫాదర్‌ లక్కి నేని ఆరోగ్య స్వామి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. అమ్మ లేని జీవితం అంధకారమన్నారు. పూజకు ముందు బలిపీఠంపై ఏసుక్రీస్తుకు గుర్తుగా ఉన్న దీప స్తంభాన్ని గురువులు కన్య సీ్త్రలు వెలిగించారు.అనంతరం ఫాదర్‌ దేవసహాయం, ఫాదర్‌ ఆరోగ్య స్వామి ప్రసంగించారు. తొలుత మహిళలు భక్తిశ్రద్ధలతో లూర్దుమాత స్వరూపాన్ని మరియాపురం పుర వీధుల్లో ఊరేగించారు. దివ్యబలి పూజలో విచారణ గురువు ఈరి మరియన్న, సహాయ గురువు జంపంగి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ సిస్టర్ల ఆధ్వర్యంలో పాటలు, పీఠం అలంకరణ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement