నష్టపరిహారం రాలేదు | - | Sakshi
Sakshi News home page

నష్టపరిహారం రాలేదు

Jan 27 2026 8:19 AM | Updated on Jan 27 2026 8:19 AM

నష్టప

నష్టపరిహారం రాలేదు

ఖరీఫ్‌లో ఎకరాకు రూ.70 వేలు ఖర్చు చేసి 2 ఎకరాలలో ఉల్లి పంట సాగు చేశాను. నేను సాగు చేసిన పంట నష్టపోయినా నష్టపరిహారం జాబితాలో నా పేరు లేదు. మా గ్రామంలో పంట సాగు చేయని రైతులకు నష్టపరిహారం వచ్చింది. నేను అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. అధికారులు చర్యలు తీసుకుని నాకు నష్టపరిహారం చెల్లించాలి.

– చంద్ర ఓబుళరెడ్డి,

ఉల్లి రైతు, ఎస్‌.చెర్లోపల్లె

సాగు చేయని రైతులకు వచ్చింది

ఉల్లి పంట సాగు చేసిన రైతులకు కాకుండా సాగు చేయని వారికి నష్టపరిహారం వచ్చింది. మా సచివాలయంలో పని చేస్తున్న వీహెచ్‌ఏ తన చేతివాటం ఉపయోగించి పంట వేయని రైతులకు జాబితాలో పేర్లు చేర్చి నష్టపరిహారం వచ్చేలా చేశారు. నేను ఉల్లి పంట సాగు చేస్తే నాకు ఇప్పటి వరకు పరిహారం రావడం లేదు. అధికారులకు ఫోన్లు చేస్తే సమాధానం లేదు. కార్యాలయంలో ఎవరూ అందుబాటులో ఉండటం లేదు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని పంట నష్టపరిహారం ఇప్పించాలి.

– గంగిరెడ్డి, ఉల్లి రైతు, సంతకొవ్వూరు

నష్టపరిహారం రాలేదు 
1
1/1

నష్టపరిహారం రాలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement