వెంకటయ్యకు ఘన నివాళి
సిద్దవటం : జనసేన సీనియర్ నాయకుడు, పారిశ్రామికవేత్త అతికారి వెంకటయ్యకు సోమవారం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నివాళులు అర్పించారు. సిద్దవటంలోని దిగువపేట ఆకులవీధిలో వెంకటయ్య స్వగృహానికి విచ్చేసి ఆయన చిత్రపటానికి మంత్రి కందుల దుర్గేష్ పూలమాల వేసి సంతాపం తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అతికారి వెంకటయ్య మృతి జనసేన పార్టీకి తీరని లోటు అన్నారు. నాలుగు దశాబ్దాలకు పైబడి కృషి, పట్టుదలతో ధైర్యవంతుడిగా రాజకీయపరంగా తనదైన శైలిలో మంచి నాయకునిగా గుర్తింపు పొందారన్నారు. పేద ప్రజల కష్టాలు తీర్చే నేతగా అతికారి వెంకటయ్య చెరగని ముద్ర వేసుకున్నారు. 63 సంవత్సరాల వయస్సులోనే ఆయన మరణించడం చాలా బాధాకరమైన విషయమన్నారు. ఆయన మన ముందు భౌతికంగా లేనప్పటికీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన సోదరుడు అతికారి కృష్ణ ఆయన కుమారుడు అతికారి దినేష్‌లు కృషి చేస్తారన్నారు. రాయలసీమ ప్రాంతంలో ప్రముఖ వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా అంచలంచెలుగా ఎదిగి అందరి ఆదరాభిమానాలు చూరగొన్నారని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్తిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ, జనసేన రాజంపేట అసెంబ్లీ సమన్వయకర్త అతికారి దినేష్, అతికారి వెంకటయ్య సోదరులు అతికారి వెంకటసుబ్బయ్య, చిన్న వెంకటయ్య, కడప జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాస్, పంచాయతీరాజ్ చాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య, చలపాటి చంద్ర, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


