ఉత్సవాలతో ఒనగూరని ప్రయోజనం | - | Sakshi
Sakshi News home page

ఉత్సవాలతో ఒనగూరని ప్రయోజనం

Jan 14 2026 9:51 AM | Updated on Jan 14 2026 9:51 AM

ఉత్సవాలతో ఒనగూరని ప్రయోజనం

ఉత్సవాలతో ఒనగూరని ప్రయోజనం

ఉత్సవాలతో ఒనగూరని ప్రయోజనం

ప్రకృతి సహజ సిద్ధమైన కొండను గండి కొట్టి చీల్చుకుంటూ పెన్నా నదీ ప్రవాహం.. ఆహ్లాదకర వాతావరణంలో రాతి కట్టడాల కోట నిర్మాణం...అద్భుత శిల్పి తోరణం.. ఇవీ గండికోట అందాలు.. పర్యాటకులకు మంత్ర ముగ్ధులను చేసే సోయగాలు.. ఈ అందాలను వీక్షించేందుకు కూటమి ప్రభుత్వం ఉత్సవం చేసింది.. దేశమంతా పబ్లిసిటీ చేసింది. తీరా అక్కడికి వెళితే వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కోటకు వెళ్లే రహదారిలో మురికి, బురదమయంగా కనిపించాయి, కోట ఎదురుగా ఉన్న అతి పెద్ద కోనేరు అపరిశుభ్రంగా కనిపిస్తోంది. కోట ఆవరణలో ఉన్న పూల మొక్కల కుండీలు సైతం ఎండిపోయి కనిపించాయి, నూతన రోడ్ల నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయి. పర్యాటకుల కోసం టెంట్లు వేసిన వారికీ సమీపంలో మురికి, చెత్తలో మద్యం సీసాలు కనిపిస్తున్నాయి అపరిశుభ్రంగా ఉన్న కోటలో కూటమి ప్రభుత్వం ఆర్భాటాల కోసం కోట్లాది రూపాయిలు వృథా చేశారని పర్యాటకులు, సందర్శకులు వాపోయారు . – ఫోటోలు, సాక్షి ఫొటోగ్రాఫర్‌, కడప.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement