అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా | - | Sakshi
Sakshi News home page

అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా

Jan 11 2026 7:38 AM | Updated on Jan 11 2026 7:38 AM

అసాంఘ

అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా

సమావేశంలో పాల్గొన్న పోలీసు అధికారులు మాట్లాడుతున్న ఎస్పీ షెల్కే సచికేత్‌ విశ్వనాథ్‌

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : రౌడీ షీటర్లు, ట్రబుల్‌ మాంగర్లు, గతంలో నేరాలకు పాల్పడిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ తదితర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కడప సబ్‌ – డివిజన్‌ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ సభలు, పల్లె నిద్ర, గ్రామాల సందర్శన తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. భూ వివాదాలు, ఆర్థ్ధిక పరమైన అంశాల వల్ల క్రిమినల్‌ కేసులు నమోదైతే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల, లీగల్‌ ప్రొసీజర్‌ మేరకు కేసు విచారణ త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి నిర్ణీత వ్యవధిలోగా చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. డ్రోన్‌ కెమెరాల ద్వారా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, బహిరంగ మద్యపానం చేసే వారిపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. స్కూళ్లు, కాలేజీలలో ‘మహిళా భద్రత’పై, సోషల్‌ మీడియా వల్ల కలిగే అనర్థాలపై, మహిళలు, బాలికల వేధింపులపై అవగాహన కల్పించాలన్నారు. 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై, హెల్మెట్‌ ధరించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. వాహనాల రికార్డులు తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.ఈ సమావేశంలో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, మహిళా పీఎస్‌ డీఎస్పీ బాలస్వామి రెడ్డి, సబ్‌ డివిజన్‌లోని సీఐలు, ఎస్‌ఐలు, పాల్గొన్నారు.

కడప పోలీస్‌ సబ్‌–డివిజన్‌ నేర సమీక్షా

సమావేశంలో ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌

అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా 1
1/1

అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement