మట్కా బీటర్లు అరెస్ట్
కడప అర్బన్ : కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మట్కా బీటర్లను శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై ప్రదీప్ కుమార్ తెలిపారు. షేక్ మస్తాన్ షరీఫ్, మొహమ్మద్ గౌస్ అనే ఇరువురు మట్కా ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి దాడులు చేసి వారి నుంచి రూ.6.950 నగదు స్వాధీన పరుచుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
టీవీ పేలి వృద్ధురాలికి
తీవ్ర గాయాలు
రామాపురం : మండలంలోని గువ్వలచెరువు గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున ఓ ఇంట్లో అకస్మాత్తుగా పోర్టబుల్ టీవీ పేలి పోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో గూడురు లక్ష్ముమ్మ అనే వృద్ధ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా టీవీ పూర్తిగా దెబ్బతినగా, బీరువా, తలుపులు, కిటికీలు, అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం స్థానికులు కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అధిక వోల్టేజ్, నిరంతరం టీవీ ఆన్‌లో ఉండటం వలన పేలుడు జరిగి ఉండవచ్చునని లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు నాయక్ తెలిపారు. ప్రజలు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, వోల్టేజ్ స్టెబిలేజర్‌లు వినియోగించాలని సూచించారు.
కడప వ్యాపారి హత్య
రాయచూరు రూరల్ : వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన నగరంలో చోటుచేసుకుంది. కడపకు చెందిన సయ్యద్ హుసేన్‌్ పాషా(25) 15 రోజుల కిందట నగరానికి వచ్చి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం గడుపుతున్నారు. గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో రాయచూరు ఆకాశవాణి కార్యాలయం వద్ద పాషా తన వ్యానులో నిద్రిస్తున్నారు. ఈ సమయంలో దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని ఎస్పీ పుట్టమాదయ్య, యస్.మంజునాథ్, బసవరాజ్ పరిశీలించారు.
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వద్ద నిత్యాన్నదానం కేంద్ర ఏర్పాటు పనులను నిలిపి వేసిన వ్యక్తి పామూరి సుబ్రమణ్యంపై శుక్రవారం టీటీడీ అధికారులు కేసు నమెదు చేశారు. పోలీసుల వివరాల మేరకు..ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఆవరణలో తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు లో భాగంగా ఈ నెల 12 వ తేదిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు పనులు నిర్వహిస్తుండంగా పామూరు సుబ్రమణ్యం అనే వ్యక్తి తమ స్థలం అంటూ ఆ రోజు ఆ పనులను నిలిపి వేయడంపై 19వ తేదీ ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో ప్రశాంతి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పామూరు సుబ్రమణ్యంపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.


