అనారోగ్యంతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బి.మహేశ్వర్ రెడ్డి (ఏఆర్ పీసీ 422) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఏఆర్ పీసీ మహేశ్వర్ రెడ్డి మృతి పట్ల జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే సిబ్బంది అకాలమరణం పొందడం బా ధాకరమన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జిల్లా ఎ స్పీ ఆదేశాల మేరకు ఆర్‌ఐ శివరాముడు.. కడప నగరం రవీంద్ర నగర్‌లోని బి.మహేశ్వర్ రెడ్డి స్వగృహం వద్దకు వెళ్లి మృతదేహం వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పోలీస్ శా ఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కాగా మహేశ్వర్ రెడ్డి 1994బ్యాచ్ కు చెందిన వ్యక్తి. భార్య, కుమార్తె ఉన్నారు. శనివారం పోలీస్ లాంఛనాలతో మ హేశ్వర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ పాల్గొన్నారు.
ములకలచెరువు : కన్న కూతురి పెళ్లి కళ్లారా చూడాలని... ఘనంగా చేయాలని కలలు కన్న ఒక తండ్రి సంతోషంతో బంధుమిత్రులకు పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకరమైన ఘటన శుక్రవారం రాత్రి ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారిపల్లెకు చెందిన పి.ఖాసీంవలి కుమార్తె అఫ్రీన్‌కు అదే గ్రామానికి చెందిన యువకుడితో వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో బంధుమిత్రులకు పెళ్లి పత్రికలు పంచేందుకు ఖాసీంవలి ఉదయం ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వెళ్లాడు. అక్కడ పెళ్లి పత్రికలు పంచి తిరిగి సాయంత్రం ఇంటికి బయల్దేరాడు. ములకలచెరువు మీదుగా మద్దయ్యగారిపల్లెకు వెళ్తుండగా నాయనచెరువుపల్లి సత్రం మలుపు వద్ద ద్విచక్రవాహనంలో ఎదురుగా వస్తున్న బి.కొత్తకోట మండలం బుచ్చిరెడ్డిగారిపల్లి నారాయణస్వామికి చెందిన ద్విచక్రవాహనం ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఖాసీంవలి తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. నారాయణస్వామి సైతం తీవ్రంగా గాయపడడంతో 108 సహాయంతో మదనపల్లి ప్రభుత్వ హాస్పెటల్‌కు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్‌ఐ నరసింహుడు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని మృతిదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ హాస్పెటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి అఫ్రీన్, అమ్మాజాన్ ఇద్దరు కుమార్తెలు, ఆసీఫ్ కుమారుడు, భార్య సంషాద్ ఉన్నారు. సంఘటన స్థలంలో వీరి రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. పెద్దదిక్కు లేకుండా చేశావు.... మేము నీకేమి అన్యాయం చేశాం దేవుడా అంటూ రోదించారు.
మహేశ్వర్ రెడ్డి (ఫైల్), నివాళులర్పిస్తున్న ఆర్‌ఐ శివరాముడు
అనారోగ్యంతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి


