అందరికీ కృతజ్ఞతలు
కడప కార్పొరేషన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలన్న చంద్రబాబు కుట్రకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కోటి సంతకాల ఉద్యమం విజయవంతంపై హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు, కార్పొరేషన్, మున్సిపాలిటీలు, అన్ని గ్రామాలలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు పర్యటించి సభలు నిర్వహించారని, ప్రతి ప్రాంతంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఈ ఉద్యమంలో అహర్నిశలు శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి అమోఘమని ప్రశంసించారు.
కోటి సంతకాల ఉద్యమం
విజయవంతంపై హర్షం
అందరికీ కృతజ్ఞతలు


