ప్రజా ప్రదక్షిణ వేదిక
● వ్యయ ప్రయాసాలతో
కలెక్టరేట్‌కు తరలివస్తున్న ప్రజలు
● సమస్యల పరిష్కారం కోసం
ఎదురుచూపులు
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కారవేదిక ‘ప్రదక్షిణ’వేదికగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్‌సెల్‌లో ప్రజలు సమస్యలు విన్నవిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. భూమికి సంబంధించిన సమస్యలే అత్యధికంగా వస్తున్నాయి. రీ సర్వేలో దొర్లిన తప్పిదాల కారణంగా తమ భూమి విసీ్త్రర్ణం తగ్గిందని, ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదుచేయాలని, పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయాలని, ఇతరులు తమ భూములను ఆక్రమించారని తదితర అనేక సమస్యలు వస్తున్నాయి.


