డబుల్ ఇంజిన్‌తో రాష్ట్రానికి ట్రబుల్
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రానికి ట్రబుల్ ఏర్పడింది.రాష్ట్రానికి వెయ్యికోట్లు నిధులు తేలేని స్థితిలో కూటమి నేతలు ఉన్నారు. ప్రజల ఆరోగ్యం, విద్య పట్ల ప్రభుత్వానికి శ్రద్ధ లేదు.కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలా వద్దా అనే విషయంపై ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ విధానం ద్వారా అభిప్రాయాలు తెలుసుకోవాలి.
– నరేన్ రామాంజులరెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి
మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండదు. ప్రైవేట్ వ్యక్తులు సేవాభావంతో వ్యవహరించరు. లాభార్జన కోసమే పనిచేస్తారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, చంద్రబాబు సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీని, ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు.
– రఘురామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ
క్రమశిక్షణా కమిటీ చైర్మన్
గొప్ప ఆశయంతో మంజూరు చేయించిన 17 మెడికల్ కాలేజీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రైవేటు పరం చేయొద్దు అని నెల రోజులుగా కోటి సంతకాల సేకరణ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
– కొండూరు అజయ్‌రెడ్డి,
కడప పార్లమెంట్ పరిశీలకులు
డబుల్ ఇంజిన్‌తో రాష్ట్రానికి ట్రబుల్
డబుల్ ఇంజిన్‌తో రాష్ట్రానికి ట్రబుల్


