పెన్నాలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
కడప అర్బన్/వల్లూరు: కడప నగర శివారులోని వాటర్ గండి పెన్నా నది ప్రవాహంలో ఆదివారం ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఆదివారం రాత్రి వరకు లభ్యం కాలేదు. చెన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో వున్న వాటర్‌గండి పెన్నానదిలో ఈత కొట్టేందుకు కడప రామాంజనేయపురానికి చెందిన నరేష్(16), అశోక్‌నగర్‌కు చెందిన రోహిత్‌బాబు (16)తోపాటు మరో ముగ్గురు కలిసి వెళ్లారు. సర దాగా ఈతకొట్టారు. అదే సమయంలో సెల్‌ఫోన్‌లతో ‘రీల్స్’ కూడా చేసుకున్నారు. ఒక్కసారిగా నరేష్, రోహిత్‌బాబుతోపాటు అరుణ్ అనే విద్యార్థి కూడా గల్లంతయ్యారు. ఈ క్రమంలో అరుణ్‌ను దేవాలయం సమీపంలో వాచ్‌మెన్‌గా వున్న ఆంజినేయులు రక్షించా డు. నరేష్, రోహిత్‌బాబు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలను చేపట్టారు. చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. వీరితోపాటు వచ్చిన అశోక్‌నగర్, భానుప్రకాష్‌లను పోలీసులు విచారణ చేస్తున్నారు.
నరేష్ (ఫైల్) రోహిత్‌బాబు (ఫైల్)
మరో విద్యార్థిని కాపాడిన వాచ్‌మ్యాన్
సరదాగా ఈత కొట్టేందుకు ఐదుగురు వెళ్లి..
వాటర్ గండిలో రీల్స్ చేసి..
పెన్నాలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు


