
లారీని ఢీకొన్న కారు
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని కడప–చిత్తూరు జాతీయ రహదారి కొలుములపల్లి సమీపంలోని కొత్త రోడ్డు వద్ద బుధవారం ఉదయం చెత్తను తరలించే లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ శ్రీనాథ్, చెత్తను తరలించే లారీ డ్రైవర్ ఏసుదాసు ప్రసాద్‌కు గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప వైపు నుంచి మద్దిమడుగు వద్ద ఉన్న కార్పొరేషన్ డంపింగ్ యార్డ్‌కు చెత్తను తరలిస్తున్న ఏపీ 04 టీఎక్స్ 8410 నెంబర్ గల లారీని రాయచోటి వైపు నుంచి కడప వైపు వస్తున్న కేఏ 04 ఎంక్యూ 8105 నెంబర్ గల మారుతీ సియాజ్ కారు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో వేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో కారు రోడ్డుపై పల్టీలు కొడుతూ మరోసారి బలంగా అదే లారీని ఢీకొనడంతో కారు ముందుభాగం దెబ్బతింది. కారుకు ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. గాయపడిన రెండు వాహనాల డ్రైవర్లను హైవే పెట్రోలింగ్ పోలీసులు 108 వాహనంలో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా
పదోన్నతి కల్పించాలి
కడప రూరల్ : హెడ్ నర్సు నుంచి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పదోన్నతులు కల్పించాలని నర్సింగ్ అసోసియేషన్ నాయకులు ప్రిస్కిల్లా, మనో థెరిస్కోవా తెలిపారు. ఆ మేరకు బుధవారం స్థానిక వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయంలో రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్యకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు చాలా మంది పదవీ విరమణ పొందే దశలో ఉన్నారని తెలిపారు. కనుక హెడ్ నర్సు నుంచి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాధమ్మ, అమరావతి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

లారీని ఢీకొన్న కారు

లారీని ఢీకొన్న కారు