
వివాహిత ఆత్మహత్యాయత్నం
మైదుకూరు : పట్టణంలోని కొత్తకొట్టాలు ప్రాంతానికి చెందిన వివాహిత వెన్నెల ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. సోమవా రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదని కుమారుడు వెంకటరమణ మైదుకూ రు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేస్తూ ఓ వివాహిత స్వయంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. అదృశ్యమైన వివాహిత, ఆత్మహత్యాయత్నం చేసి వీడియో తీసిన వివాహిత వెన్నెలగానే పోలీసులు గుర్తించారు. తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వివాహిత వెన్నెల తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆమె ఎక్కడున్నది తెలియడం లేదు.
రైలు కింద పడి సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండల పరిధిలోని చిలంకూరు గ్రామానికి చెందిన గురుకిరణ్ (31) అనే సచివాలయ ఉద్యోగి ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లో ప్యాసింజర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని ఎర్రగుంట్ల రైల్వే ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. చిలంకూరు గ్రామానికి చెంగిన గురుబ్రహ్మ కుమారుడు గురు కిరణ్ ముద్దనూరు మండలం కోడిగాండ్లపల్లి గ్రామంలోని సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఒక బాబు సంతానం. అయితే కుటుంబ సభ్యులు తనను ఒంటరి వాడిని చేశారని మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్‌కు వచ్చిన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
నీళ్లనుకుని.. యాసిడ్ తాగిన పారిద్ధ్య కార్మికురాలు
మదనపల్లె రూరల్ : నీళ్లనుకుని పారిశుద్ధ్య కార్మికురాలు యాసిడ్ తాగి తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన బుధవారం బి.కొత్తకోట మండలంలో జరిగింది. స్థానికంగా బస్టాండు వద్ద నివాసం ఉంటున్న గంగులప్ప భార్య పాపులమ్మ, బి.కొత్తకోట నగరపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తోంది. ఉదయం విధులకు వెళ్లి పనులు ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. దాహంగా ఉండటంతో నీళ్లు అనుకుని బాటిల్‌లో నింపిన యాసిడ్‌ను పొరపాటుగా తాగింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు చికిత్స అందించారు.