
విద్యుత్ షాక్‌తో మూడు పందులు మృతి
వల్లూరు : మండల కేంద్రమైన వల్లూరులోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద విద్యుత్ షాక్‌తో మూడు పందులు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. వివరాలిలా.. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రి, గ్రామ సచివాలయాలకు వెళ్లే దారిలో ఉన్న గ్రామ పంచాయతీకి చెందిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద విద్యుత్ తీగలు కిందకు జారిపోయి కేంద్రం ఇనుప గేటుకు తగులుకున్నాయి. దీంతో గేటుకు విద్యుత్ ప్రసరించింది. బుధవారం ఉదయం కేంద్రం వద్ద సంచరిస్తున్న మూడు పందులు గేటుకు తగిలి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఒక వైపు వర్షం కురుస్తుండడంతో పాటు ఆ సమయానికి మనుషులు అటువైపు రాక పోవడంతో పెను ప్రమాదం తప్పినట్‌లైంది. పందులు మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది.