
కొత్త యాడ్ బోర్డుల కోసం ఈఓఐ పద్ధతిలో టెండర్లు
కడప కార్పొరేషన్ : కడప నగరంలో కొత్త యాడ్ బోర్డులు ఏర్పాటు చేయుటకు ఈఓఐ పద్ధతిలో టెండర్లు పిలవడం జరిగిందని నగరపాలక కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19వ తేదీన సాక్షిలో ప్రచురితమైన శ్రీమనోడే.. ఫ్రీగా ఇచ్చేయ్‌శ్రీ కథనంపై ఆయన స్పందించారు. లీడ్ స్పేస్ ఏజెన్సీతో బీఓటీ పద్ధతిలో 2019లో 15 ఏళ్ల కాలానికి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయుటకు ఒప్పందం కుదిరిందన్నారు. ఆ ఒప్పందం ప్రకారం కార్పొరేషన్ గుర్తించిన ప్రదేశాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. బదులుగా కార్పొరేషన్ అంగీకరించిన ప్రకారం కొన్ని ప్రదేశాలలో ప్రకటనల హోర్డింగ్ బోర్డులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చామన్నారు. భవిష్యత్‌లో కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాలు గుర్తించినట్లయితే.. అవసరమైన చోట్ల ప్రకటనల హోర్డింగుల కోసం అదనపు అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. కలెక్టర్‌తో ఈ నెల 15న జరిగిన సమావేశంలో ఈ పనులకు అవసరమైన నేషనల్ ఎయిర్ క్లీన్ ప్రోగ్రాం(ఎన్‌సీఏపీ) కింద నిధులు మంజూరు చేసి, ఈ ప్రతిపాదనను ప్రస్తావించడం జరిగిందన్నారు. ఈ అదనపు ప్రకటన హక్కులు మంజూరు చేసే ప్రతిపాదనను నగరపాలక మండలి తిరస్కరించి, తిరిగి వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలపడం జరిగిందన్నారు.
విద్యుత్ షాక్‌తో
విద్యార్థిని దుర్మరణం
పుల్లంపేట : మండల పరిధిలోని రాజుగారిపల్లికి చెందిన విద్యార్థిని మానస(17) విద్యుత్ షాక్‌తో దర్మరణం చెందింది. ఆ బాలిక ఇంటర్మీడియెట్ చదువుతుండేది. ఆదివారం ఇంట్లో స్విచ్ ఆన్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మానస మృతదేహాన్ని మాజీ మండలాధ్యక్షురాలు ముద్దా పెద్ద విజయమ్మ, మండలాధ్యక్షుడు ముద్దా బాబుల్‌రెడ్డి, స్థానిక నాయకులు కుమార్‌రెడ్డిలు సందర్శించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలియజేశారు. మానస మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రాజంపేట రూరల్ : ఏపీ అంటే అమరావతి, పోలవరం అనే విధంగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకులు కొత్తమద్ది సురేష్‌బాబు, జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథరెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని ఆకేపాటి ఎస్టేట్‌లో ఆదివారం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ రూరల్ పరిధిలో కోటీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకేపాటి అనీల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకులు కొత్తమద్ది సురేష్‌బాబు, జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథరెడ్డి పాల్గొని మండల పరిధిలోని నాయకులు, కార్యకర్తలకు కోటి సంతకాల సేకరణపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలతోపాటు జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందజేస్తున్న పథకాలన్నింటిని అమలు చేస్తామని కూటమి నాయకులు ప్రజలను మభ్య పెట్టారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం అపసోపాలు పడుతోందని ఎద్దేవా చేశారు. తమ సామాజిక వర్గానికి మేలు చేసేందుకు అమరావతికి వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను అమలు చేయక పోగా.. నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారని దుయ్యబట్టారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయనీయబోమని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆశా దీపంగా నిలుస్తున్న మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం సరికాదన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి సంతకాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రేపటి మన బిడ్డల భవిష్యత్ కోసం మనం వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలన్నారు. ఈ సమావేశంలో అధిక సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజంపేట : ఎకై ్సజ్ సురక్ష యాప్‌పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.మధుసూదన్ తెలిపారు. రాజంపేటలో పలు మద్యంషాపులను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 122 మద్యంషాపులు, 11 బార్లను క్షుణ్ణంగా తనిఖీలు చేశామన్నారు. ప్రతి షాపులో ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం మాత్రమే ఉందన్నారు. నకిలీ మద్యం ఎక్కడా లేదన్నారు. నకిలీ మద్యం అమ్మితే ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా ఇట్టే పసిగట్టవచ్చునన్నారు. ఒక వేళ ఎక్కడైనా మద్యం అమ్మిన బాటిల్ కన్సూమర్ పోర్టల్‌లో వివరాలు రాకపోయినా, మద్యం బాటిల్ అనుమానాస్పదంగా ఉన్న వెంటనే స్థానిక ఎకై ్సజ్ అధికారులు, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ (7981216391)ను సంప్రందించాలన్నారు. వాట్సాప్‌లో ఆ బాటిల్ ఫొటో పంపిన తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా 1,11,628 మద్యం సీసాలను స్కాన్ చేసి అమ్మడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రాజంపేట ఎకై ్సజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మల్లిక, ఎస్‌ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

కొత్త యాడ్ బోర్డుల కోసం ఈఓఐ పద్ధతిలో టెండర్లు