
మేనమామ వేధింపులపై విచారణ
కై కలూరు : మేనమామ వేధింపులు, తల్లి, అమ్మమ్మ, తాత చితకబాదిన ఘటనలో బాధిత బాలిక నుంచి కై కలూరు రూరల్ పోలీసులు ఆదివారం వివరాలు సేకరించారు. ఏలూరు జిల్లా కై కలూరు మండలం చటాకాయి గ్రామానికి చెందిన జయమంగళ కుమార అభిమన్యు మొదటి భార్య కుమార్తె (14)ను ఆమె తల్లి కామాక్షి గత నెల 26న వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు మండలం అల్లూరి పంచాయతీ అగ్రహారం తీసుకువెళ్లారు. అక్కడ బాలికను తల్లి, అమ్మమ్మ, తాత విపరీతంగా కొట్టడంతోపాటు తండ్రి వద్దకు పంపాలంటే.. మేనమామ ఉమాశంకర్ లైంగిక కోరిక తీర్చాలని బలవంతం చేశారని బాలిక పోలీసులకు చెప్పినట్టు సమాచారం. దీంతో కై కలూరులో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బాలిక తల్లి కామాక్షి, అమ్మమ్మ మోరు నాగులమ్మ, తాత వెంకటరమణ, మేనమామ ఉమాశంకర్‌లను దోషులుగా చేర్చి రిపోర్టును పంపారు. బాలిక మైనర్ కావడంతో పోక్సో కేసు నమోదు చేసే అవకాశం ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలను బద్వేలుకు పంపారు. అక్కడ పూర్తి విచారణ చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారని పోలీసులు చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో మండలంలోని పందిళ్లపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చాపాడు మండలం నెరవాడకు చెందిన గొర్ల బాలయ్య (50) మృతి చెందాడు. 108 సిబ్బంది సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాలయ్య ఎర్రగుంట్లకు వెళ్లి పనులు చూసుకుని తిరిగి కమలాపురం మీదుగా చాపాడుకు వెళ్లేందుకు తిరిగి వస్తున్న నేపథ్యంలో.. పందిళ్లపల్లె వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ఘటనలో బాలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స నిమిత్తం ఇతర ఆసుపత్రికి రెఫర్ చేశారు. అయితే ఇతర ఆసుపత్రికి వెళ్తుండగానే మృతి చెందాడు.
వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం రామసముద్రం మండలంలో జరిగింది. చెంబకూరుకు చెందిన చాంద్‌బాషా భార్య ఆయేషా(30) కుటుంబ సమస్యలతో ఇంటి వద్దే పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూ విభాగంలో చికిత్సలు అందించారు.
రైలు కింద పడి వ్యకి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఒంటిమిట్ట–భాకరాపేట రైల్వేస్టేషన్ మధ్య ఆదివారం రైలు కింద పడి ఒక వ్యక్తి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు శివశరత్ చౌదరి(30)గా గుర్తించామని, ఇతను రాజంపేట పట్టణం నూనెవారిపల్లెకు చెందిన వాడిగా తెలిసిందన్నారు. అతను నేషనల్ హైవేస్ అథారిటీస్‌లో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తుండే వాడన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మేనమామ వేధింపులపై విచారణ