
పునరుద్ధరిస్తాం
ఇమాంబేగ్ బావిని ఎప్పటి నుంచో పునరుద్ధరించాలని చూస్తున్నాం. దీనికి సంబంధించి అనుమతుల కోసం పురావస్తు శాఖ వారి దృష్టికి ఎన్నో సార్లు తీసుకువెళ్లడం జరిగింది. కానీ పురావస్తు శాఖ నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో భక్తులకు తెలియాల్సిన ఇమాంబేగ్ బావి చరిత్ర మరుగునపడింది. పురావస్తు శాఖ అనుమతిస్తే కొన్ని రోజుల్లోనే ఇమాంబేగ్ బావిని పునరుద్ధరిస్తాం.
– అమర్‌నాథ్‌రెడ్డి, టీటీడీ సివిల్ విభాగం ఏఈ, ఒంటిమిట్ట
చరిత్ర అనవాళ్లు కాపాడండి
ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరాముడు ఉన్నారనే సత్యాన్ని చూసిన ఇమాంబేగ్ దానికి గుర్తుగా నిర్మించిన బావినే ఇమాంబేగ్ బావి అని పిలుచుకుంటున్నాం. స్వామి ఇక్కడ సాక్షాత్తుగా ఉన్నాడనే సత్యానికి నిదర్శనంగా ఈ బావిని చూపిస్తారు. అలాంటి ఆలయ చారిత్రక అనవాళ్లను కలిగిన ఇమాంబేగ్ బావిని పునరుద్ధరించి భక్తులకు దాని చరిత్ర తెలిసే విధంగా టీటీడీ చర్యలు చేపట్టాలి.
– నారాయణరెడ్డి, శ్రీకోదండ రామాలయం, మాజీ చైర్మన్, ఒంటిమిట్ట