ఉల్లిని ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉల్లిని ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలి

Oct 11 2025 6:26 AM | Updated on Oct 11 2025 6:26 AM

ఉల్లిని ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలి

ఉల్లిని ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలి

ఉల్లిని ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలి ● రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వం

కడప కార్పొరేషన్‌: ఉల్లి పంటను తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజదబాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిలతో కలిసి ఆయన కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉల్లి రైతులు అత్యంత దీన పరిస్థితిలో ఉన్నారన్నారు. మూడు రోజులుగా మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డిలు ఉల్లి పంటలను పరిశీలించి వారి సమస్యలను కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నామన్నారు. క్వింటా ఉల్లిని రూ.1200తో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కమలాపురం, మైదుకూరులో కొనుగోలు కేంద్రాల ఫోన్‌ నంబర్లు కూడా ఇచ్చారన్నారు. ఆ ఫోన్లకు కాల్‌ చేస్తే ఏ ఒక్కరూ ఫోన్‌ తీయడం లేదన్నారు. మిట్టమానుపల్లెకు చెందిన ఓబన్న కుమారుడు ఓబులేసు అనే రైతు కూలీ ఖర్చులు కూడా రావనే బాధతో ఉల్లి పంటను వంకలో వేసి నీటి పాలు చేస్తున్న దృశ్యాలను మీడియాకు చూపారు. ఉల్లిని క్వింటా రూ.300లకు కూడా కొనుగోలు చేయని పరిస్థితి ఉందన్నారు. కర్నూలులో హెక్టారుకు రూ.50వేల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఇంతవరకూ జీవో ఇవ్వలేదన్నారు. దాన్ని వైఎస్సార్‌ కడప జిల్లాకు కూడా వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. ఉల్లి సాగుకు ఎకరాకు రూ.1.20లక్షలు సాగు ఖర్చు అయ్యిందని, ప్రభుత్వం కనీస మద్దతు ధరతో పంటను కొనుగోలు చేసి, హెక్టారుకు రూ.50వేల పరిహారం ఇస్తే కనీసం 60 శాతం రికవరీ అవుతుందన్నారు. లేనిపక్షంలో రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. రాష్ట్రంలో ఇన్ని తీవ్రమైన సమస్యలుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఎంపీ అన్నారు. అధికారయంత్రాంగం, పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకులను వేధించడంపైనే వారి సమయాన్నంతా వెచ్చిస్తున్నారన్నారు. పులివెందులలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో పరామర్శకు వెళ్లిన వారిపై కూడా 307 సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారని ఉదహరించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో విమానాల్లో చక్కర్లు కొట్టే పవన్‌ కళ్యాణ్‌కు ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం సరఫరా అవుతోందని ఆరునెలల క్రితమే చెప్పానని టీడీపీ కార్యకర్త ఒకరు ఫేస్‌బుక్‌లో పెట్టారన్నారు. 111కోట్ల క్వార్టర్‌ బాటిళ్లు తయారు చేసి, అందులో రూ.48కోట్ల క్వార్టర్‌ బాటిళ్లు అమ్మారన్నారు. ఝార్ఖండ్‌లో జరిగిన కల్తీ మద్యం కేసులో ఈడీ ఎంటరై సత్వర చర్యలు చేపట్టిందని, ఏపీలో ఇంత జరుగుతున్నా సీబీఐ, ఈడీ నిద్రపోతున్నాయని విమర్శించారు. నకిలీ మద్యం స్కాంను వెలికి తీసిన ఎకై ్సజ్‌ సీఐ హిమబిందుకు సస్పెన్షన్‌ను బహుమతిగా ఇవ్వడం దారుణమన్నారు.

వైద్య సేవలు బంద్‌..

ప్రభుత్వం నెట్‌వర్క్‌ హాస్పిటళ్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ చేశారని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. ఫీజురీయంబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందని తెలిపారు.

● ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు పి. ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్‌, రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హెక్టారుకు రూ.50వేలుపరిహారం ఇవ్వాలి

ప్రభుత్వ ఆధ్వర్యంలోనేనకిలీ మద్యం సరఫరా

ఆరునెలల క్రితమే చెప్పినట్లు టీడీపీ కార్యకర్తే ఫేస్‌బుక్‌లో పెట్టారు

ఝార్ఖండ్‌ తరహాలో కల్తీ మద్యంపైసీబీఐ, ఈడీ జోక్యం చేసుకోవాలి

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి డిమాండ్‌

ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. జిల్లాకు రూ.173 కోట్లు ఇన్యూరెన్స్‌న్స్‌ వచ్చిందని ప్రకటనలు ఇస్తున్నారని, ఏ ఊర్లో, ఏ పంటకు ఎంత బీమా వచ్చిందనే వివరాలు తెలపడం లేదన్నారు. క్వింటా రూ.2500లకు కొనాల్సిన ఉల్లిని ప్రభుత్వం రూ.1200లకు కొంటామని చెప్పి ఇప్పటికీ ఒక కేజీ కూడా కొనలేదన్నారు. జిల్లాలో ఉల్లి రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. నిన్న కొమ్మద్దిలో 16 ఎకరాల్లో ఉల్లి పంట వేసి నష్టపోయి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. గత ప్రభుత్వంలో 21 రోజుల్లో పంట నష్టం ఇచ్చేవారని గుర్తు చేశారు. ఈనెల 15వ తేదీ లోపు కూటమి ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement