ఇదేం పద్ధతి! | - | Sakshi
Sakshi News home page

ఇదేం పద్ధతి!

Oct 5 2025 4:55 AM | Updated on Oct 5 2025 4:55 AM

ఇదేం

ఇదేం పద్ధతి!

● ‘పచ్చ’పార్టీకి నకిలీ దెబ్బ

ఆదాయ వనరులుగా అక్రమ మార్గాలనుఎంచుకుంటున్న తమ్ముళ్లు

అధికారుల కళ్లెదుటనేకల్తీ మద్యం వ్యాపారం

కొనసాగుతున్న ఎకై ్సజ్‌పోలీసుల విచారణ

జిల్లాలో టీడీపీ నేతలు నకిలీ మద్యం వ్యవహారంలో అడ్డంగా దొరికిపోవడంతో పార్టీ పరువు బజారున పడింది. ప్రసుత్తం దొరి కిన నాయకుల వెనుక ముఖ్య నాయకులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పెద్ద నేతల జోలికి వెళ్లకుండా దొరికిన వారి వరకే సర్దుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుండగా, నాయకులు అరెస్టు కావడంతో పచ్చ పార్టీ పరిస్థితి చూస్తే పరువు కాస్త గంగలో కలిసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

● జిల్లాలోని ములకలచెరువు కేంద్రంగా తయారు చేస్తున్న నకిలీ మద్యం ఎక్కడికెక్కడికి సరఫరా చేస్తున్నారన్న దానిపై నిగ్గు తేల్చాల్సి ఉంది. ప్రస్తుతం ఎకై ్సజ్‌ ఉన్నతాధికారుల ప్రాథమిక సమాచారం మేరకు ఇక్కడ తయారు చేసి ప్రముఖ సంస్థ లేబుళ్లు వేసి బెల్ట్‌ షాపులకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.ఒక్క ములకల చెరువు మండలంలోని బెల్ట్‌షాపులకేనా? లేదా నియోజకవర్గంతో జిల్లా వ్యాప్తంగా సరఫరా జరుగుతుందా? అన్న దానిపై వివరణ ఇవ్వాల్సి ఉంది. నకిలీ మద్యం కాబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ సొమ్ము చేసుకునేందుకు ఇష్టానుసారంగా విష పదార్థాలు వాడటం మూలంగా తాగే వారి ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదముంది. అధికారులు పూర్తి స్థాయిలో విచారించి నకిలీపై నిగ్గు తేల్చా లని ప్రజలు కోరుతున్నారు. నకి లీ మద్యం నేపథ్యంలో సమీప ప్రాంతాల్లోని మందుబాబులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని పలువురు సూచిస్తున్నారు.

సాక్షి రాయచోటి: అన్న మయ్య జిల్లాలో నకిలీ మద్యం కలకలం రేపుతోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం అఽధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్‌ ఆదాయమే పరమావధిగా నాయకులు అడ్డదారులు ఎంచుకుంటున్నారు. ఏది పడితే అది దొరికిన కాడికి దోచుకుంటున్నారు. ఇప్పటికే ఇసుక, భూములు, రేషన్‌ బియ్యం, మైనింగ్‌, మద్యం ఇలా అన్నిచోట్ల అడుగులు పెట్టి అందిన కాడికి పక్కకు తోస్తున్నారు. ఇదేమని అడిగే అధికారులు, ఇది తప్పు అని చెప్పే ప్రజాప్రతినిధులు లేకపోవడంతో పచ్చ రాజ్యంలో తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. నకిలీ మద్యం వల్ల ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా బడా నేతల అభయమో..ముఖ్య నేతల భరోసానో తెలియదుగానీ పెద్ద ఎత్తున ములకలచెరువులో టీడీపీ నేతలు నకిలీ మద్యం తయారు చేయడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

ఇది తగునా?

కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక పని చేసుకుని మంచిగా సంపాదించుకుంటే ఎవరూ కాదనరు. అలా కాదని అక్రమ, వక్రమార్గాలను ఎంచుకోవడంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. టీడీపీకి చెందిన సీనియర్‌ నాయకులు సురేంద్రనాయుడుతోపాటు మరికొంతమంది టీడీపీకి చెందిన కీలక వ్యక్తులు నకిలీ మద్యం తయారు చేసి బెల్ట్‌షాపులకు పంపిస్తున్న వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలో ఉంటూ ఏదైనా ప్రజలకు సేవ చేయాల్సిన నేతలు ఇలా చెడు మార్గాలను ఎంచుకోవడంపై ఇది తగునా? అంటూ పార్టీకి చెందినవారే ముక్కున వేలేసుకుంటున్నారు. నకిలీ మద్యం తయారు చేసి షాపులకు పంపడం మూలంగా...నిపుణులు లేకుండా స్పిరిట్‌తో కూడుకున్న విషం ప్రాణాలు తీస్తే అందుకు బాధ్యత ఎవరిదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఏదో ఒకరకంగా సంపాదించుకోవాలన్న నెపంతో ఎంచుకున్న మార్గం చూసి ప్రతి ఒక్కరూ ఇదేం పద్ధతి అని ప్రశ్నిస్తున్నారు.

కొనసాగుతున్న విచారణ

జిల్లాలో కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఎకై ్సజ్‌శాఖ ఉన్నతాధికారులతోపాటు జిల్లా అఽధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 10 మందిని అరెస్టు చేసి, మరో ముగ్గురి కోసం స్పెషల్‌ బృందాలు గాలిస్తున్నట్లు వెల్లడించారు. పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని సీజ్‌ చేసిన ఎకై ్సజ్‌ అధికారులు మరింత లోతుగా దర్యాప్తుచేయాలని, జిల్లాలో ఇంకా ఎక్కడైనా ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయేమో విచారణ జరపాలని జిల్లా వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదేం పద్ధతి!1
1/1

ఇదేం పద్ధతి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement