
చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం
పులివెందుల రూరల్: చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నా రు. శనివారం పట్టణంలోని స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆయన పులివెందుల సబ్ డివిజన్‌లోని పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ల వారీగా అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలు, డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పోలీసు అధికారుల అలసత్వం ఉన్నట్లు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
ఎస్సీ నచికేత్ విశ్వనాథ్