
జిల్లా ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్
కడప అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో 14 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలకు స్థానచలనం, నియామకం చేస్తూ శనివారం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ ఉత్తర్వులను జారీ చేశారు. వైఎస్‌ఆర్ కడప జిల్లా ఎస్పీగా షెల్కే నచికేత్ విశ్వనాథ్‌ను నియమించారు. ఈయన 2019 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం ఇంటలిజెన్స్ విభాగంలో అధికారిగా విధులను నిర్వహిస్తున్నారు. నేడో, రేపో ఆయన జిల్లాకు విచ్చేసి ఎస్పీగా బాధ్యతలను చేపట్టనున్నారు.
నియమితులైన ఏడు నెలలకే
ఎస్పీ ఈ.జీ అశోక్‌కుమార్ బదిలీ....
వైఎస్‌ఆర్ జిల్లా ఎస్పీగా నియమితులైన ఈ.జీ అశోక్‌కుమార్ 2025 జనవరి 24న విధుల్లో చేరారు. గతంలో కడపలో డీఎస్పీగా పనిచేసిన ఈజీ అశోక్‌కుమార్ మరలా జిల్లా ఎస్పీగా నియమితులై విధుల్లో చేరినపుడు ఒకవైపు ప్రజలు, మరోవైపు అధికారులు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. జిల్లామీద పట్టువున్న అధికారిగా విధులను నిర్వహిస్తారని భావించారు. అనుకున్నట్లుగానే శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన శైలిలో విధులను నిర్వహించారు. కానీ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో పోలింగ్ నిర్వహణ, ఇతర అంశాలు అభద్రతా భావాన్ని నెలకొల్పాయి. ఐపీఎస్ అధికారుల నియామకంలో బదిలీ అయిన అధికారుల జాబితాలో ఈయన పేరును ప్రస్తావించలేదు. కానీ ఒకటి రెండు రోజుల్లో మరికొంతమంది నియామకాల జాబితాలో ఈ.జీ అశోక్‌కుమార్ పేరు రావచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఎస్పీ అశోక్‌కుమార్ బదిలీ ఏడు నెలలకే జరగడం అటు అధికారుల్లో, ఇటు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కనుగిలి
రాయచోటి: అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కనుగిలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానికంగా పనిచేస్తున్న ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు కృష్ణాజిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు.
నియమితులైన ఏడు నెలలకే
ఎస్పీ అశోక్‌కుమార్ బదిలీ

జిల్లా ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్