
జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు
కడప అగ్రికల్చర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో గత మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు ఆరుతడి పంటలకు అలాగే మామిడి, నిమ్మ, చీని, డ్రాగన్‌ప్రూట్, సపోట, అరటి వంటి ఉద్యాన పంటలకు కూడా మేలని పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఉల్లి రైతుల్లో మాత్రం ఆందోళన తప్పడం లేదు. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కోతదశకు వచ్చిన ఉల్లిపంట దెబ్బతినే అవకాశం ఉండటంతో ఉల్లి రైతుల్లో మాత్రం ఆందోళన తప్పడం లేదు. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న అన్నదాతలకు ఈ వర్షం మరో విధంగా ఉల్లి రైతులను దెబ్బతీయనుంది. ఈ వర్షం మరో రెండు మూడు రోజులు కురుస్తే మాత్రం ఉల్లి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. జిల్లాలోని మైలవరంలో అత్యధికంగా 45 ఎంఎం వర్షం కురిసింది.

జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు