
ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తున్నాం..
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో ప్రవేశం కల్పించిన తర్వాత ఇంగ్లీష్ మీడియం కోర్సుపై పట్టును పెంచేందుకు ఓరియంటేషన్ తరగతులను నిర్వహిస్తున్నాం. ఎక్కువమంది ట్రిపుల్ ఐటీలలో గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఉన్నారు. వారికి ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియం కోర్సులు ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకే వారికి రెండు నెలలపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాం. కొన్ని సబ్జెక్టులు ఫెయిలైన వారికి రెమిడియల్ క్లాసులు నిర్వహించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా యోగా, మెడిటేషన్, వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహించి తర్ఫీదు ఇస్తున్నాం. మానసిక వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించి ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తున్నాం.
– ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, ఇడుపులపాయ