● మందుల కొరత | - | Sakshi
Sakshi News home page

● మందుల కొరత

Jul 20 2025 1:48 PM | Updated on Jul 21 2025 5:21 AM

● మంద

● మందుల కొరత

కడప రిమ్స్‌లో ఓపీ రిజిస్ట్రేషన్‌ కోసం ప్రజల అవస్థలు వైద్య సేవలు పొందుతున్న జ్వర పీడితులు

కడప రూరల్‌: ప్రజలపై జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో పెను మార్పులు రావడంతో జ్వరాలు చుట్టుముట్టాయి. దీనికి కలుషిత నీరు, అపరిశుభ్రత వాతావరణం తోడైంది. ఫలితంగా విష జ్వరాలు దాడి చేస్తున్నాయి. మరో వైపు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యానికి సమస్యల జబ్బు పట్టింది. దీంతో సక్రమంగా వైద్య సేవలు అందకపోవడం ప్రజలకు శాపంగా మారింది.

● కమలాపురంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో మౌళిక సదుపాయాలు పడకేశాయి. ఇక్కడ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించే కీలకమైన ఎక్స్‌ రే సౌకర్యం లేదు. ఆఖరికి ఈసీజీ సదుపాయం కూడా లేదు. ఈ రెండు రకాల పరీక్షలకు రోగులు కడపకు వస్తున్నారు. ఉచితంగా అందాల్సిన వైద్య సేవలకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఆ ఆసుపత్రిలో నీటి సౌకర్యం లేకపోవడం దారుణం.

● ప్రొద్దుటూరు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో చక్కెర వ్యాధిని నియంత్రించే ఇన్సులిన్‌ ఇంజక్షన్‌లకు కొరత ఏర్పడింది. ప్రధానంగా ఇక్కడ ఉన్న జిల్లా ఆసుపత్రికి ఒక రోజుకు 800 నుంచి 1000 వరకు ఔట్‌ పేషెంట్స్‌ వస్తారు. అందులో దాదాపు 200 మంది వరకు జ్వరాలతో బాధపడే వారే ఉన్నారు.

● జమ్మలమడుగులోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో వైద్యులు సమయపాలన పాటించడం లేదు. ఎప్పుడొస్తారో..ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఫేషియల్‌ అటెండెన్స్‌ మాత్రం వేసి, వెళ్లిపోతుంటారు. పులివెందుల ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. సకల వైద్య సౌకర్యాలతో ప్రజలకు కార్పొరేట్‌ వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రి నిర్వీర్యంగా మారింది. ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి.

వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువ...

ఇప్పుడిప్పుడే వ్యాధుల తీవ్రత పెరిగిపోతోంది. కలుషి త నీరు, అపరిశుభ్రత వాతావరణం తదిర కారణాల వల్ల వైరల్‌ ఫీవర్స్‌, టైఫాయిడ్‌ జ్వరాలు సంక్రమిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించి, సరైన మందులు వాడితే ఒక వారంలో జ్వరం తగ్గుముఖం పడుతుంది. అలాగే డయేరియా కేసులు కూడా నమోదవుతున్నాయి. వివిధ రకాల వ్యాధులతో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలతో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్‌ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల విశ్వాసం కోల్పోవడంతో చాలా మంది ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్ధికంగా చితికి పోతున్నారు. వ్యాధుల సంఖ్య అధికారిక లెక్కల కంటే అనధికారికంగా అధిక సంఖ్యలో ఉన్నట్లుగా వైద్యులు చెపుతున్నారు.

వైద్య రంగంపై పాలకులకు చిన్న చూపు...

వైస్సార్‌సీపీ పాలనలో వైద్య రంగం విలసిల్లింది. ప్రభుత్వ ఆసుపత్రులు ఆధునిక సౌకర్యాలతో ఉండేవి. ఏ వ్యాధి వచ్చినా సత్వర వైద్య సేవలు లభించేవి. ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానం సక్రమంగా అమలైంది, వైద్య రంగానికి సంబంధించిన 108 అంబులెన్స్‌, 104 సంచార వైద్య శాల తదితర విభాగలు విజయవంతగా అమలు అయ్యేవి. ఇప్పుడు కూటమి పాలనలో ఆ రంగాలన్నీ కుదేలయ్యాయి. వైద్య రంగంపై చిన్న చూపు చూస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో జనవరి 1 నుంచి జూన్‌ 23

వరకు నమోదైన వ్యాధుల వివరాలు

వ్యాధులు సంఖ్య

మలేరియా 03

డెంగ్యూ 76

చికున్‌గున్యా 06

డయేరియా 1,276

టైఫాయిడ్‌ 261

జిల్లాలో కడప నగరంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (పెద్దాసుపత్రి), ప్రొద్దుటురులో జిల్లా ఆసుపత్రి, పులివెందులలో సర్వజన ఆసుపత్రి, వైద్య విధాన పరిషత్‌లో పోరుమామిళ్ల, మైదుకూరు, చెన్నూరు, బద్వేల్‌, సిద్దవటం, కమలాపురం, వేంపల్లెలో కలిపి మొత్తం 7 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లు ఉన్నాయి. ఈ ఆసుపత్రిల్లో దాదాపుగా అన్ని వ్యాధులకు వైద్య సేవలు అందించాలి. ఏదైనా పెద్ద జబ్బు, సమస్యతో కూడకున్నదైతే కడప రిమ్స్‌లో వైద్యం చేయాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 51 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 24 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక ఆసుపత్రిలో 172 రకాల మందులను అందుబాటులో ఉంచాలి, 60 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలి. అలాగే విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు 342 ఉన్నాయి. ఒక క్లినిక్‌ ద్వారా 108 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలి. చాలా వరకు ఆసుపత్రుల్లో మందులకు కొరత ఏర్పడింది. జ్వరం, జలుబు, దగ్గుకు మందులకు కొరత ఉంది అలాగే చక్కెర వ్యాధిని నియంత్రించే ఇన్సూలిన్‌ ఇంజక్షన్‌లు అందుబాటులో లేవు. కొన్ని ఆసుపత్రులు ప్రక్కన ఉన్న ఆసుపత్రుల నుంచి లేని మందులను తెచ్చుకొని రోగులకు ఇస్తున్నారు. ఏమని అడిగితే...సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌ నుంచి మందులు రావాల్సి ఉందని వైద్య సిబ్బంది చెపుతున్నారు.

● మందుల కొరత 1
1/2

● మందుల కొరత

● మందుల కొరత 2
2/2

● మందుల కొరత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement