
స్వచ్ఛందంగా యువకుల రక్తదానం
కడప ఎడ్యుకేషన్ : కడప బాలాజీ నగర్‌లోని నెహ్రూ కేంద్ర యూత్ హాస్టల్ నందు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని స్టెప్ సీఈవో సాయి గ్రేస్, పైడి కాల్వ విజయ్‌కుమార్, ఖూన్‌కా రిష్టా చైర్మన్ యం.తారీఖ్‌అలీ తెలిపారు. స్వచ్ఛంద సేవా సంస్థలు , ఖూన్ కా రిష్టా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టెప్ సీఈఓ సాయిగ్రేస్ మాట్లాడుతూ జిల్లాలోని స్వచ్ఛంద సేవా సంస్థలు ఐక్యమతంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. బ్లడ్ బ్యాంక్ నందు రక్త నిల్వలు తక్కువ ఉన్నాయని, 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ప్రతి మూడు నెలలకోకసారి రక్తదానం చేయుటకు ముందుకు రావాలన్నారు. దీంతో పాత కణాలు పోయి కొత్త కణాలు వచ్చి ఆరోగ్యంగా ఉంటామని తెలియజేశారు.. ఖూన్ కా రిష్టా చైర్మన్ యం.తారీఖ్‌అలీ మాట్లాడుతూ రక్తదాన శిబిరాల్లో ఇప్పటివరకు 315 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూటురు విజయ్ కుమార్, వి.శివశంకర్, పట్టుపోగుల సుబ్బారావు, ప్రేమ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
స్టెప్ సీఈఓ సాయి గ్రేస్