
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని ఇద్దరు దుర్మరణం
ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలోని గంగాదేవిపల్లె సమీపంలో శుక్రవారం వేగంగా వస్తున్న లారీ రహదారి ప్రక్కనే వున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కమల్ సాహెబ్(64), క్లీనరు ఫకృద్దీన్(45) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎస్‌ఐ మైనుద్దీన్ సమాచారం మేరకు.. బళ్లారి నుంచి ఇనుప పైపుల లోడుతో లారీ చైన్నెకు వస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున గంగాదేవిపల్లె సమీపంలోకి రాగానే వేగం అదుపుతప్పి లారీ రహదారి ప్రక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. లారీలో ఉన్న డ్రైవరు, క్లీనరుపై ఇనున పైపులు పడిపోయాయి. దీంతో ఇరువురు క్యాబిన్‌లో ఇరుక్కపోయి చనిపోయారు. సమచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతిచెందిన వారు బళ్లా రి వాసులుగా గుర్తించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని ఇద్దరు దుర్మరణం

విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని ఇద్దరు దుర్మరణం