
రూ.20 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
ఏడుగురు నిందితుల అరెస్ట్
పీలేరు : రూ.20 లక్షల విలువైన ఎర్ర చందనం స్వాధీ నం చేసుకుని ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పీలేరు డీఎఫ్‌వో గురుప్రభాకర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో వాహనాలను తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా వచ్చిన మారుతి సుజుకీ వాహనాన్ని తనిఖీ చేయగా 13 ఎర్రచందనం దుంగలున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనంతోపాటు ఎర్రచందనం స్వాధీనం చేసుకుని తమిళనాడుకు చెందిన నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఏలుమలై, సెంథిల్, అన్‌బలగన్, రామన్, అన్నాదొరై, కుప్పుస్వామి, మణి ఉన్నట్లు డీఎఫ్‌వో వివరించారు. ఈ దాడిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్, సిబ్బంది ప్రకాష్‌కుమార్, ప్రతాప్, రెడ్డిప్రసాద్, నందీశ్వరయ్య పాల్గొన్నారు.