
అధిక వడ్డీల వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య
సింహాద్రిపురం : అధిక వడ్డీల వేధింపులతో సింహాద్రిపురం మండలం అగ్రహారానికి చెందిన రైతు సాకే అమర్నాథ్(35) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మృతుడి భార్య గంగాదేవి కథనం మేరకు..
తన భర్త అమర్నాథ్‌కు 2 ఎకరాల భూమి ఉండడంతోపాటు ఫైనాన్స్‌లో జేసీబీ తీసుకుని పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇతడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖర్చులకు గానూ గ్రామంలో రూ.10 చొప్పున వారం వడ్డీ చెల్లిసూ్‌త్ గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి, మరింతమంది వద్ద అప్పు డబ్బు తీసుకున్నారు. ఆ వడ్డీ పెరిగి ఐదింతలు కాగా, ఒత్తిడి తట్టుకోలేక అప్పు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఎనిమిది తులాల బంగారు వారికి ఇవ్వగా.. ఇంకా రూ.5 లక్షలు ఇవ్వాలని అడగడంతో అమర్నాథ్ ఇబ్బందిపడ్డారు. ఇది చెల్లించలేని పరిస్థితిలో తన రెండెకరాల భూమి అగ్రిమెంట్ లేకుండా దౌర్జన్యంగా తీసుకుని శంకర్‌రెడ్డి సాగు చేసేందుకు పొలం సిద్ధం చేశారన్నారు. అంతేగాక తన భర్తను ఫోన్‌ద్వారా వడ్డీ డబ్బు ఇవ్వాలని వేధించేవాడన్నారు. ఈ విషయం అమర్నాథ్ ఫోన్‌లో రికార్డు అయ్యింది. వేధింపులు తాళలేక అమర్నాథ్ మనస్థాపానికి గురై ఈ నెల 9న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో పులివెందులలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.
భర్త హత్య కేసులో భార్య, బావమరిది అరెస్ట్
కడప అర్బన్ : కడప నగరంలోని వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎర్రముక్కపల్లి బాల వికాస్ స్కూల్ వెనుక నివాసముంటున్న దేరంగుల సుబ్బరాయుడు (32) హత్య కేసులో మృతుడి భార్య హరిత, బావమరిది హరికృష్ణను అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు.
మద్యం తాగి రావడంతో భార్య హరిత, బావమరిది హరి కృష్ణ గొడవపడ్డారు. ఈ క్రమంలో సుబ్బరాయుడును గోడకేసి తోయడంతో పదునైన మోటు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై స్థానిక వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ బి.రామకృష్ణ దర్యాప్తు చేశారు.