
వాటర్‌షెడ్ పనుల్లో నాణ్యత పాటించండి
బి.కోడూరు: మండలంలో జరుగుతున్న వాటర్‌షెడ్ పనులను నిబంధనల ప్రకారం నాణ్యతతో చేయాలని వాటర్‌షెడ్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిశేషారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పెద్దుళ్లపల్లె వాటర్‌షెడ్ పరిధిలో జరిగిన పనులను స్టేట్ చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గోపినాఽథ్, జిల్లా క్వాలిటీ ఆఫీసర్ విజయభాస్కర్, ఏపీఓ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి విడిరాళ్ల కట్టలు, కుంటలు, డకౌట్ గుంతలు, పారంఫండ్స్ వంటి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో వాటర్‌షెడ్ సిబ్బంది, పెద్దుళ్ళపల్లె వాటర్‌షెడ్ చైర్మన్ రాజారెడ్డి, నాయకులు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.