
కారాగారంలో సెల్‌ఫోన్.. రచ్చ
కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారంలో సెల్‌ఫోన్ లభ్యం కావడంపై రచ్చ రేగుతోంది. తాను డబ్బులు ఎరవేశానంటూ రిమాండ్ ఖైదీ ఒకరు తెలియజేసినట్లు సమాచారం బయటకు రావడం చర్చనీయాంశమవుతోంది. పలువురు బాధ్యులైన సిబ్బందిపై వేటు వేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఇటీవల సెల్ ఫోన్‌లు పదే పదే తనిఖీలలో లభ్యం కావడం, పత్రికల్లో వార్తలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నెల 15న ‘కడప కేంద్ర కారాగారంలో మరోసారి సెల్‌ఫోన్, ఛార్జర్ లభ్యం’ వార్త ప్రచురితమైంది. దీంతో జైళ్ల శాఖ రాష్ట్ర డీజీ అంజనీకుమార్ ఆదేశాల మేరకు.. రాజమండ్రి రీజియన్ (నార్త్‌జోన్) డీఐజీ ఎంఆర్ రవికిరణ్ కడప కేంద్ర కారాగారంలో విచారణకు బుధవారం విచ్చేశారు. నేరుగా కారాగారంలోని బ్యారక్‌ల వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పీడియాక్ట్‌లో రిమాండ్‌లో వున్న జాకీర్‌ను పిలిపించి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయించారు. రిమాండ్ ఖైదీ ఏమాత్రం తడబడకుండా శ్రీతాను సెల్‌ఫోన్ బయటనుంచి తెప్పించుకోవడానికి జైలర్ నుంచి ఆపై అధికారుల వరకూ డబ్బు ఎర వేశాననీ తెలియజేసినట్లు సమాచారం. కేంద్ర కారాగార సూపరింటెండెంట్ కుమార్తె వివాహానికి వెళ్లేటపుడు అక్షరాలా రూ. 80వేలు నజరానాగా తీసుకువెళ్లాడని, తనకు సహకరించిన జైలర్ నుంచి అధికారి స్థాయి వరకు తాను రూ.7లక్షలు లంచంగా ఇచ్చాననీ తెలియజేసినట్లు తెలిసింది. జాకీర్ నుంచి దశల వారీగా ఇప్పటివరకూ 12 సెల్‌ఫోన్లు, ఛార్జర్ స్వాధీనం చేసుకున్నారు. మొదట దొరికిన సెల్‌ఫోన్ నుంచి లభించినరిపోర్ట్‌ను డిఐజీ క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు తెలిసింది. విచారణలో బాధ్యులైన 12 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని, కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాజేశ్వరరావుపై బదిలీ వేటు వుండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కారాగారం నుంచి బయటకు వెళుతున్న ‘ఔట్ గ్యాంగ్’ ఖైదీల వద్ద యథేచ్చగా మద్యం లభ్యమవుతుందని తాజా సమాచారం. పెట్రోల్ బంకులో ఎలాంటి లాభాలను అక్రమంగా పొందవచ్చో అక్కడ విధులను నిర్వహిస్తున్న ప్రొద్దుటూరు గ్యాంగ్‌లో అరెస్టయి శి అనుభవిస్తున్న ఓ ఖైదీ మీద ఆధారపడి కొందరు అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం. విచారణకు వచ్చిన డిఐజీ ఎం.ఆర్ రవికిరణ్ శ్రీసాక్షిశ్రీతో మాట్లాడుతూ డీజీ ఆదేశాల మేరకు కడప కేంద్ర కారాగారానికి విచారణకు వచ్చామన్నారు. విచారణ ఇంకా జరుగుతోందనీ, పూర్తి సమాచారం రానున్న రోజుల్లో వివరిస్తామని తెలియజేశారు.
పదే పదే లభ్యం కావడంపై డీఐజీ విచారణ
స్టేట్‌మెంట్ ఇచ్చిన రిమాండ్ ఖైదీ జాకీర్
12 మంది బాధ్యులపై
చర్యలకు రంగం సిద్ధం
కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ బదిలీకి అవకాశం?

కారాగారంలో సెల్‌ఫోన్.. రచ్చ