
వృద్ధుడు అదృశ్యం
కడప అర్బన్ : కడప గౌస్ నగర్‌కు చెందిన షేక్ మహబూబ్ సాహెబ్(65)గత నాలుగు రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనకు వృద్ధాప్యంతోపాటు మతిస్థిమితం సరిగా లేదని అందులో పేర్కొన్నారు. ఎవరికై నా కనిపిస్తే 8555903070కు సమాచారం ఇవ్వాలని వారు విన్నవించారు.
మైనర్ బాలికకు అంత్యక్రియలు
జమ్మలమడుగు : గండికోటలో హత్య కాబడిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వైష్టవి అంత్య క్రియలు బుధవారం స్వగ్రామం హనుమనగుత్తిలో నిర్వహించారు. మంగళవారం రాత్రి జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి రాత్రి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. బుధవారం హనుమనగుత్తిలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్థులు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు.
బాలికను హత్య చేసిన వారిని శిక్షించాలని నిరసన
ప్రొద్దుటూరు : బాలికను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ, ఐద్వా నాయకులు గురమ్మ, రమాదేవి డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఐద్వా ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో జిల్లాలో మహిళల హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, అభం, శుభం తెలియని చిన్నపిల్లలను చిదివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ బాలికను యువకుడు లోకేష్ గండికోటకు తీసుకుపోయాడని, అక్కడ ఆమె హత్యకు గురైందని తెలిపారు. ఆమెను ఎవరు హత్య చేశారనేది స్పష్టంగా ఇంతవరకూ బయటికి రాలేదని, రాజకీయాలకు లొంగకుండా ఆమెను చంపిన వారిని పోలీసులు త్వరగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు లక్ష్మీదేవి, ఝాన్సీరాణి, విజయకుమారి, కళావతి, మేరి, నీతమ్మ, అన్నమ్మపూర్ణ, సీఐటీయూ పట్టణ కార్యదర్శి విజయ్‌కుమార్, సాల్మన్, రాఘవ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం ములకలచెరువు మండలంలో జరిగింది. ములకలచెరువు రాజా నగర్‌కు చెందిన గంగన్న కుమారుడు నరసింహులు(60) గత కొంతకాలంగా షు గర్, బీపీతోపాటు, కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. వ్యాధి నివారణకు చికిత్స తీసుకున్నా ఫలితం కనిపించకపోవడంతో మనస్తాపం చెందాడు. బుధవారం ఇంటి వద్దే సూపర్ వాస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

వృద్ధుడు అదృశ్యం

వృద్ధుడు అదృశ్యం