
ఉప ఎంపీపీ పదవి వైఎస్సార్‌సీపీ కై వసం
చాపాడు : మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్ష పదవి వైఎస్సార్‌సీపీ కై వసమైంది. ఎంపీటీసీ సభ్యులు బాలనరసింహారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పల్లవోలు ఎంపీటీసీ, మండల ఉపాధ్యక్షురాలు నగర్తి సుందరమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ స్థానానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయగా ఎన్నికల అధికారి వి.విజయలక్ష్మి ఉప ఎంపీపీ ఎన్నిక బుధవారం నిర్వహించారు. చియ్యపాడు ఎంపీటీసీ ఎస్‌ఆర్.బాలనరసింహారెడ్డిని ఉప ఎంపీపీగా మండల అధ్యక్షుడు తెలిదేల లక్షుమయ్య ప్రతిపాదించగా, చియ్యపాడు–2 ఎంపీటీసీ సుబ్బరామిరెడ్డి బలపరిచారు. వారితోపాటు మరో ఆరుగురు ఎంపీటీసీలు మద్దతు ఇవ్వడంతో బాలనరసింహారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వీరకిషోర్, ఎంపీటీసీలు చాపాడుఆస్మ, పార్వతమ్మ, ఈశ్వరమ్మ, శివ, సీమోన్, రమాదేవి, అజ్మతుల్లా పాల్గొన్నారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికై న ఎస్సార్ బాలనరసింహారెడ్డిని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి, నాయకులు జయరామిరెడ్డి, జయసుబ్బారెడ్డి, మాజీ ఎంపీటీసీ మహేష్‌యాదవ్, మనోహర్, రమేష్ తదితరులు శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
సీతారామాపురం ఉప సర్పంచ్‌గా లక్ష్మీదేవి..
మండలంలోని సీతారామాపురం పంచాయతీ ఉప సర్పంచ్‌గా భూమిరెడ్డి లక్ష్మీదేవి ఏకగ్రీవంగా నియమితులయ్యారు. అనారోగ్యం కారణంగా ఉప సర్పంచ్ గుర్రప్ప తన పదవికి రాజీనామా చేయగా ఎన్నిక కమిషన్ బుధవారం ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించింది. ఎన్నికల అధికారి హరికృష్ణ పర్యవేక్షలో జరిగిన ఈ ఎన్నికలో టీడీపీ నాయకులు మార్తల నరసింహారెడ్డి వర్గీయురాలు భూమిరెడ్డి లక్ష్మీదేవిని ఉప సర్పంచ్‌గా వార్డు మెంబర్ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వాతి, పంచాయతీ కార్యదర్శి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
బాలనరసింహారెడ్డిని ఎన్నుకున్న ఎంపీటీసీలు

ఉప ఎంపీపీ పదవి వైఎస్సార్‌సీపీ కై వసం