
సమస్య పరిష్కరించుకునే ప్రక్రియే మధ్యవర్తిత్వం
కడప అర్బన్ : కక్షి దారుల సమస్యలను పరిష్కరించుకునే ప్రక్రియనే మధ్యవర్తిత్వం అంటారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై కడపలో నిర్వహించిన వన్ కే వాక్ఙ్ ర్యాలీని బుధవారం పచ్చజెండా ఊపి ఆమె ప్రారంభించారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ కూడలి నుంచి న్యాయ సేవా సదన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అంతుకు ముందు ర్యాలీని ప్రారంభించిన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని మాట్లాడుతూ మధ్యవర్తి అంగీకార పత్రంలో షరతులను కక్షిదారులకు వివరించి స్పష్టంగా ఒప్పంద పత్రాన్ని తయారుచేస్తారని, ఇది ఆంతరంగికమైన ప్రక్రియ అని వివరించారు. ఈ స్వచ్ఛంద ప్రక్రియకు నిర్దిష్టమైన ఆదేశిక నియమాలు లేవని, ఏడాది పొడవునా చేసుకునే ప్రక్రియ అని వివరించారు. ఈ కార్యక్రమంలో నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి గరికపాటి దీనబాబు, ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.శాంతి, ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి జి.రమేష్ కుమార్, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబాఫకృద్దీన్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రత్యూషకుమారి, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి జి.సి.ఆసిఫా సుల్తానా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.భార్గవి, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.ఈశ్వర్ వెంకటప్రసాద్, మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.విజయలక్ష్మి, కడప బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, బార్ అసోసియేషన్ సెక్రెటరీ చంద్ర వదన, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్‌న్స్ కౌన్సిల్ హరిబాబు, మాజీ సైనిక ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి రమణయ్య, ప్యానల్ న్యాయవాదులు, మధ్యవర్తిత్వ న్యాయవాదులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
వన్‌కే వాక్ ర్యాలీలో జిల్లా ప్రధాన
న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని