
ఆత్మహత్యకు పాల్పడిన మహిళ మృతి
జమ్మలమడుగు : ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఎర్రగుంట్ల మండలం కల్లమల్ల గ్రామంలోని కృష్ణానగర్‌కు చెందిన సువార్తమ్మ(35) డ్వాక్రా సంఘానికి డబ్బులు కట్టాలని, డబ్బులు ఇవ్వాలంటూ కుమారుడిని కోరింది. దీంతో తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో డ్వాక్రా సంఘానికి డబ్బులు కట్టలేక.. ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరెతో ఉరి వేసుకునే ప్రయత్నం చేసింది. అయితే చుట్టుపక్కల వారు గుర్తించి వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరుకు తరలించారు. అక్కడి నుంచి కడప రిమ్స్‌కు తరలించడంతో అక్కడ చికిత్స పొందుతూ మరణించిందని కల్లమల్ల పోలీసులు పేర్కొన్నారు.
కందుల నాని అలియాస్ ఓబుల్‌రెడ్డి దౌర్జన్యం
– కందుల రాజమోహన్‌రెడ్డి తనయుడు
కందుల మురళీమోహన్‌రెడ్డిపై దాడి
కడప అర్బన్ : కందుల రాజమోహన్‌రెడ్డి తనయుడు బీజేపీ నేత కందుల మురళి మోహన్‌రెడ్డి (42)పై కేఎస్‌ఆర్‌ఎం గ్రూప్ అఫ్ కాలేజెస్ చైర్మన్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి అలియాస్ నాని తన అనుచరులతో కలిసి మంగళవారం ఉదయం విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ సంఘటనలో బీజేపీ నేత కందు మురళీమోహన్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ముక్కు, ఎడమ కంటికి గాయాలయ్యాయి. ఇంకా శరీరమంతా దెబ్బలు తగిలాయి. గాయపడిన కందుల మురళీమోహన్‌రెడ్డిని వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో బాధితుడు మురళీమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కడప నగరం రాజారెడ్డి వీధిలోని కందుల రెసిడెన్సీలో 105 ప్లాట్‌లో తాను వుంటున్నానని, అదే అపార్ట్‌మెంట్‌లో 6వ అంతస్తులో కందుల చంద్రఓబుళరెడ్డి అలియాస్ నాని నివాసం వుంటున్నాడన్నారు. అదే ఇంటిలో తన పెద్దమ్మ వుంటున్నారని మంగళవారం ఉదయం వాళ్లింటికి తాను కాఫీ తాగేందుకు, టిఫిన్ తినడానికి వెళ్లి మంచిచెడ్డలు పలుకరింపుగా వెళ్లానన్నారు. అదే సమయంలో ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతున్న సమయంలో.. కందుల చంద్ర ఓబుళరెడ్డి అలియాస్ నాని తన అనుచరులతో కలిసి తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. ఈ సంఘటనపై అతనిపై, బాధ్యులైన అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప ఒన్‌టౌన్ సీఐ బి.రామకృష్ణ తెలియజేశారు. తీవ్రంగా గాయపడి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న మురళీమోహన్‌రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బా రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్, ఇతర బీజేపీ నాయకులు, బంధువులు, స్నేహితులు వచ్చి పరామర్శించారు.

ఆత్మహత్యకు పాల్పడిన మహిళ మృతి