
ముగిసిన హుసేని పీర్ దర్గా ఉరుసు
బద్వేలు అర్బన్ : పట్టణంలోని దర్గా వీధిలో వెలసిన హుసేనిపీర్ దర్గా 200వ ఉరుసు మహోత్సవాలు మంగళవారం నిర్వహించిన తహలిల్ ఫాతిహతో ముగిసాయి. ఇందులో భాగంగా సాయంత్రం స్వామి వారసులు స్వామి సమాధికి పూలచాదర్ సమర్పించి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వామి వారసులతోపాటు శిష్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దర్గా ఆవరణలో మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో స్వామి నాల్గవ, ఐదవ తరం వారసులు మున్వర్‌బాష, సలీం, దర్గారహమతుల్లా, దర్గాషఫివుల్లా, దర్గాకరీముల్లా, ఆర్గనైజర్లు షరీఫ్, అంజాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఏసీఏ పోటీల్లో
చిత్తూరు జట్టు విజయం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్‌లో మూడవ రోజైన మంగళవారం కడప జట్టుపై చిత్తూరు జట్టు 5 పరుగులతో విజయం సాధించింది. కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 193 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 85 ఓవర్లకు 239 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని క్యాశప్‌రెడ్డి 37 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని జయప్రకాశ్ 3, దినేష్ 3, తేజేష్ 2 వికెట్లు తీశారు. కాగా కడప జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 139 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 239 పరుగులు మాత్రమే చేసింది. చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

ముగిసిన హుసేని పీర్ దర్గా ఉరుసు

ముగిసిన హుసేని పీర్ దర్గా ఉరుసు