
‘మధ్యవర్తిత్వం’ ప్రచారంపై శ్రద్ధ వహించాలి
కడప అర్బన్ : దేశం కోసం మధ్యవర్తిత్వంపై ప్రచారం, అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని అన్నారు. సోమవారం రాష్ట్ర న్యాయసేవాధికారసంస్థ ఆదేశానుసారంగా జిల్లా వ్యాప్తంగా న్యాయమూర్తులతో నిర్వహించిన వర్చువల్ మీటింగ్ ద్వారా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారికి దిశానిర్దేశం చేశారు. కూడళ్లు, దిశా పోలీస్ స్టేషన్ మొదలగు ప్రాంతాలలో ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేయించాలన్నారు. మధ్యవర్తిత్వానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేయించాలన్నారు. ఈ నెల 10 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం వారాంతపు రోజున 16వ తేదీన మధ్యవర్తిత్వ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ర్యాలీలు, వన్‌కే వాక్‌తోపాటు, బహిరంగ సమావేశాలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్ పాల్గొన్నారు.