
బౌలర్ల ధాటికి బ్యాటర్ల విలవిల
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీడే మ్యాచ్‌లు రెండవ రోజు కొనసాగాయి. వైఎస్‌ఆర్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో కర్నూలు–నెల్లూరు జట్లు ఆడుతుండగా.. నెల్లూరు జట్టుపై కర్నూలు జట్టు 26 పరుగులతో విజయం సాధించింది. సోమవారం 81 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు కర్నూలు బౌలర్ల ధాటికి 50.2 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది. కర్నూలు జట్టులోని పి.వివేక్ అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు పడగొట్టాడు. యూహాస్ 4 వికెట్లు తీసి చక్కగా బౌలింగ్ చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు నెల్లూరు బౌలర్ల ధాటికి కేవలం 29.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌట్ అయింది. నెల్లూరు జట్టులోని నేత్ర నంద తన చక్కటి బౌలింగ్‌తో 5 వికెట్లు తీశాడు. సుదాంత్ 4 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 43 ఓవర్లకు 94 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కర్నూలు జట్టులోని రుత్విక్ కళ్యాణ్ 5 వికెట్లు, యూహాస్ 3 వికెట్లు తీశారు. దీంతో రెండవ రోజే కర్నూలు జట్టు 26 పరుగులతో విజయం సాధించింది,
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన కడప–చిత్తూరు జట్ల మధ్య జరుగుతున్న మరో మ్యాచ్‌లో 299 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం రెండవ రోజు మ్యాచ్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 71.4 ఓవర్లలో 383 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఎండి షారుఖ్ అక్తర్ 183 బంతుల్లో 31 ఫోర్లు, 7 సిక్సర్లతో 222 పరుగులు చేశాడు. కడప జట్టులోని గైబు 3 వికెట్లు, హితేష్ 4 వికెట్లు, తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 67 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఆ జట్టులోని సియండి పైజాన్ 58, పర్హాజ్ ఖాన్ లోడి 48 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని జయప్రకాశ్ 2 వికెట్లు తీశాడు. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.
నెల్లూరు జట్టుపై కర్నూలు విజయం

బౌలర్ల ధాటికి బ్యాటర్ల విలవిల

బౌలర్ల ధాటికి బ్యాటర్ల విలవిల

బౌలర్ల ధాటికి బ్యాటర్ల విలవిల