
ఆచూకీ తెలపరూ..
కడప అర్బన్ : కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎన్జీఓ కాలనీలో వెంకటేశ్వరస్వామి గుడి ఎదురుగా నివాసం వుంటున్న పోకూరు యమున (28)తన ఇద్దరు కుమార్తెలు పోకూరి సింధూరి (9), పోకూరి కుసుమాంజలి (6)లు జూన్ 24వ తేదీ నుంచి కనిపించడం లేదని భర్త పోకూరు సురేష్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎన్.రాజరాజేశ్వర్‌రెడ్డి తెలియజేశారు. జూన్ 23వ తేదీన యమున, తన కుమార్తెలతో కలిసి రాత్రి 11:30 గంటల సమయంలో తనతోపాటు ఇంటిలో నిద్రించారని, 24వ తేదీన తెల్లవారుజామున 5 గంటల సమయంలో తాను లేచి చూస్తే కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తరువాత అన్ని చోట్ల వెతికామని, కనిపించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పై వ్యక్తుల ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా కింది సెల్‌నెంబర్లు: సీఐ 9121100520, ఎస్‌ఐలు 9121100521, 9121100522 లకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.
ఎరువు దుకాణాల తనిఖీ
ప్రొద్దుటూరు రూరల్ : ప్రొద్దుటూరు పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలపై సోమవారం వ్యవసాయ శాఖ అధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో మైదుకూరు రోడ్డులోని మహాలక్ష్మి ఫర్టిలైజర్స్ దుకాణ యజమాని హోల్‌సేల్‌కు సంబంధించిన ఎరువులను రీటైల్ దుకాణంలో ఉంచి అమ్మకాలు జరుపుతున్నట్లు వారు గుర్తించారు. సుమారు రూ.13 లక్షల విలువ చేసే హోల్‌సేల్ ఎరువుల అమ్మకాలను అధికారులు నిలుపుదల చేశారు. అలాగే ఎరువుల దుకాణాల లైసెన్స్‌లను, రికార్డులను, నిల్వలను పరిశీలించారు. ఈ దాడులలో కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయ ఏడీఏ ఎస్.వెంకటేశ్వర్లు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ పి.మల్లికార్జున రావు, కడప జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయ టెక్నికల్ ఏఓ గోవర్ధన్, ప్రొద్దుటూరు మండల వ్యవసాయాధికారి వరిహరికుమార్ పాల్గొన్నారు.

ఆచూకీ తెలపరూ..