
మూఢనమ్మకాలు వీడాలి.. శాసీ్త్రయంతో ముందుకెళ్లాలి
కడప ఎడ్యుకేషన్ : మూఢ నమ్మకాలు వీడి, శాసీ్త్రయ ఆలోచనలతో ముందుకెళ్లాలని జేవీవీ జాతీయ ఉపాధ్యక్షుడు బి.విశ్వనాథ్ పేర్కొన్నారు. కడప ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రొఫెసర్ సురేష్‌కుమార్ అధ్యక్షతన జేవీవీ రాష్ట్ర మహాసభలు రెండు రోజులుగా జరుగుతున్నాయి. ఆదివారం నిర్వహించిన సమావేశంలో బి.విశ్వనాథ్ మాట్లాడుతూ నేటి స్పీడు యుగంలో కూడా చేతబడుల వంటి మూఢాచారాలతో ప్రాణాలను తీయడం వంటి సంఘటనలు బాధాకరమని అన్నారు. ముఖ్యంగా మేధావులు, ఉపాధ్యాయ, అధ్యాపకులు మూఢాచారాల నిర్మూలనలో ప్రధాన భూమిక పోషించాలని అన్నారు. జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్.గోపాల్ నాయక్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జన విజ్ఞాన వేదిక పోరాడుతోందన్నారు. ముఖ్యంగా బాలబాలికల సంపూర్ణ ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ తదితరాల కోసం జేవీవీ ఎనలేని కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర కోశాధికారి పి.సనావుల్లా మాట్లాడుతూ భవిష్యత్తులో జన విజ్ఞాన వేదిక అవసరం సమాజానికి మరింతగా ఉందన్నారు. నేటి యువతరం ముందుకు వచ్చి జేవీవీ ఆశయాల సాధనకు కృషి చేయాలని తెలిపారు. జేవీవీ సలహా మండలి సభ్యులు కె.సురేష్‌బాబు, ప్రముఖ వైద్యులు ఫారుఖ్, రామగోపాల్, రాజా వెంగళరెడ్డి, ఓబులరెడ్డి, రమణయ్య, అశోక్ కుమార్, అవ్వారు అర్జున్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యపరంగా మూఢనమ్మకాలు చాలా ప్రమాదకరమని, అనారోగ్యం వస్తే తక్షణమే సరియైన చికిత్స తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు, సుధాకర్‌రెడ్డి, రామారావు, మురళీధర్, సుదర్శన్, వరలక్ష్మి, మీన, సుజాత, స్వరాజ్యలక్ష్మి తదితరులు మాట్లాడారు. మహాసభల్లో జేవీవీ రాష్ట్ర నాయకులు పి.సుబ్బరాజు నరసింహారెడ్డి, సుబ్బారావు, బాలాజీ, జిల్లా నాయకులు రాంబాబు, భాస్కర్, శ్రీరాములు, నాగార్జునరెడ్డి, సుధాకర్, గౌరీశంకర్, ఎల్లేశ్వరరావు, మహబూబ్‌బాషాతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల జేవీవీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.