
ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీడే మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు ఆదివారం వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కర్నూలు–నెల్లూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కర్నూలు జట్టు 74 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఆ జట్టులోని దైవిక్ 58, రోహిత్ గౌడ్ 34 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సుశాంత్ 4, రిత్విక్ రెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 26 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
కేఓఆర్‌ఎం మైదానంలో..
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో కడప–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కడప జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 38.4 ఓవర్లకు 139 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని లోకేష్ 56 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని తేజేష్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5, దినేష్ 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 51 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేసింది. ఎండి షారుఖ్ అక్తర్ 167 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లతో 202 పరుగులు చేశాడు. తనీశ్వర్ టెండూల్కర్ 46 పరుగులు చేశాడు. దీంతో చిత్తూరు జట్టు 160 పరుగుల అధిక్యంలో ఉంది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.

ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం

ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం