
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపికల్లో కడప జిల్లాకు చెందిన పూర్వజ రెడ్డి అండర్–15, 17 విభాగాలలో సింగిల్స్ విజేతగా నిలిచి సత్తాను చాటినట్లు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు జిలానీబాషా తెలిపారు. ఆదివారం నగరంలోని డీఎస్సీ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్–15 బాలుర విభాగంలో ప్రొద్దుటూరుకు చెందిన క్రీడాకారులు రాణించి మొత్తం జిల్లా జట్టులోని స్థానాలను కై వసం చేసుకున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారన్నారు. అండర్–15, 17 విభాగాలలో జరిగిన ఈ ఎంపికలో బాలబాలికలకు విడివిడిగా సింగిల్స్, డబుల్స్‌లో పోటీలను నిర్వహించి జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులకు జిల్లా అసోసియేషన్ సభ్యులు గంగాధర్, నాగరాజు డాక్టర్ ప్రతాప్ రెడ్డి, విశ్వనాథరెడ్డి జ్ఞాపికలను అందజేశారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు వీరే..
అండర్ 15 బాలురు జట్టు – డి.ఈశ్వర్ ప్రసాద్‌రెడ్డి, చంద్రకిషోర్, ిపీబీజీ వర్షిత్ (ప్రొద్దుటూరు)
అండర్ 15 బాలికల జట్టు – ఎల్.పూర్వజరెడ్డి, బి.హరిణి, రితిక, కావ్య
(కడప)
అండర్ 17 బాలుర జట్టు – వేద వ్యాస్ వర్మ, ఎల్ సుప్రీత్‌రెడ్డి (కడప) సి.విశ్వతేజ (ప్రొద్దుటూరు)
అండర్ 17 బాలికల జట్టు – రమ్యశ్రీ (ప్రొద్దుటూరు) ఎల్.పూర్వజ, కావ్య, రితిక (కడప)