అన్నదాతలు వానకాలం వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఎగువ రాష్ట్రంలో కురిసిన వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతుండడంతో.. కేసీ కెనాల్‌ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి. జూరాల, ఆల్మట్టి నుంచి వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఈ ఏ | - | Sakshi
Sakshi News home page

అన్నదాతలు వానకాలం వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఎగువ రాష్ట్రంలో కురిసిన వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతుండడంతో.. కేసీ కెనాల్‌ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి. జూరాల, ఆల్మట్టి నుంచి వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఈ ఏ

Jul 13 2025 7:38 AM | Updated on Jul 13 2025 7:38 AM

అన్నద

అన్నదాతలు వానకాలం వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఎగువ రాష

నిండిన శ్రీశైలం ప్రాజెక్టు

త్వరలో కేసీ కాలువకు నీటి విడుదల

జిల్లాలో 92,937 ఎకరాల కేసీ ఆయకట్టు

ఊపందుకోనున్న సాగు

అన్నదాతల్లో ఆనందం

కడప అగ్రికల్చర్‌ : ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా పరవళ్లు తొక్కుతోంది. కేసీ అధికారులు త్వరలో కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా కేసీ కెనాల్‌ కింద 92,937.01 ఎకరాల ఆయకట్టు ఉంది. రైతులకు కావాల్సిన పచ్చిరొట్ట విత్తనాలను అధికారులు పంపిణీ చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండటంతో కేసీ కెనాల్‌కు నీరు విడుదల కానున్న నేపథ్యంలో.. నారుమడుల సాగు జోరందుకోనుంది. రైతన్నలు ఇప్పటికే మండల కేంద్రాలకు వెళ్లి విత్తనవడ్లు తెచ్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. నది పరీవాహక ప్రాంతాల్లోని రైతులు తెచ్చకున్న విత్తనపు వడ్లను నానబెట్టి మండెకట్టి నారుమడులు సాగు చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. నారుమడుల సాగుకు సంబంధించి చిన్ని చిన్న కయ్యలను ఏర్పాటు చేసుకుని, అందులో దమ్ము చేసుకుంటూ హడావిడిగా ఉన్నారు. నీటి ఆధారం ఉన్న కొందరు రైతులు ఇప్పటికే నారుమడులను సాగు చేసుకున్నారు. నీటి ఆధారం లేని వారు కేసీకి నీరు విడుదల కాగానే నారుమడులను సిద్ధం చేసుకుంటారు. ముందుగా నారుమడులు సిద్ధం చేసుకున్న రైతన్నలు కేసీ కాలువకు నీరు రాగానే వరినాట్లు ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 1,93,722 ఎకరాల్లో సాధారణ పంటల సాగు లక్ష్యం కాగా.. ఇందులో 80 వేల ఎకరాల్లో వరి పంట సాగు కానుంది.

సత్తువ పంటలుగా జనుము, జీలుగల సాగు

నీటి ఆధారం ఉన్న రైతాంగం వరి సాగుకు ముందుగా.. భూమికి సత్తువ కోసం జీలుగలు, జనుములను చల్లుకుని దమ్ముకు సిద్ధం చేసుకుంటున్నారు. నారుమడి సిద్ధమై వరినాట్లు వేసుకునేందుకు నెల రోజులకు పైగా గడువు ఉండటంతో.. ఆలోపు జీలుగలు, జనుము బాగా పెరిగి భూమికి సత్తువగా పనికొస్తుంది. నీటి ఆధారం లేని రైతులు ఇటీవల కురిసిన వర్షాలకు సాగు చేసుకున్నారు. మరి కొంత మందికేసీకి నీరు రాగానే జీలుగలు, జనుములు సాగు చేస్తారు. వీరు నారుమడులు సాగు చేసి.. అది సాగుకు సిద్ధమయ్యే సమయానికి ఈ జీలుగ, జనుము పంట కూడా దమ్ముకు సిద్ధమవుతుంది. దీంతో ఈ జీలుగ, జనుము పంట భూమికి సత్తువగా పనికొస్తుంది.

జిల్లాలో వరినాట్లు ప్రారంభం

నది పరీవాహక, నీటి ఆధారం ఉన్న రైతులు ముందుగా నారుమడులు ఏర్పాటు చేసుకుని వరిసాగు పనులు ఆరంభించారు. ఇప్పటికే జిల్లాలో నది పరీవాహక ప్రాంతాలైన చెన్నూరు, కడప, కమలాపురం, సిద్దవటం, వల్లూరు, చెన్నూరు, చక్రాయపేట, జమ్మలమడుగు తదితర మండలాల పరిధిలో వెయ్యి ఎకరాల వరకు వరి పంట సాగైనట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.

ప్రతి రైతు పాటించాలి

నారుమడులు సాగు చేసుకునే రైతులు పైన తెలిపిన అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇందులో నిర్లక్ష్యం చేస్తే సాగు తరువాత వరి పంటలకు చీడపీడలను ఆశించి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వరిపంట సాగు తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

– డాక్టర్‌ వీరయ్య, కో ఆర్డినేటర్‌, ప్రధాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, వైఎస్సార్‌ జిల్లా.

అన్నదాతలు వానకాలం వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఎగువ రాష1
1/4

అన్నదాతలు వానకాలం వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఎగువ రాష

అన్నదాతలు వానకాలం వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఎగువ రాష2
2/4

అన్నదాతలు వానకాలం వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఎగువ రాష

అన్నదాతలు వానకాలం వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఎగువ రాష3
3/4

అన్నదాతలు వానకాలం వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఎగువ రాష

అన్నదాతలు వానకాలం వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఎగువ రాష4
4/4

అన్నదాతలు వానకాలం వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఎగువ రాష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement