
సెంచరీలతో కదం తొక్కిన కడప బ్యాట్స్‌మన్లు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లో తొలి రోజు మంగళవారం వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ మైదానంలో కడప బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కారు. కడప, అనంతపురం జట్లు తలపడగా ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కడప జట్టు 88.4 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 461 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రణీల్ రెడ్డి తన బ్యాటింగ్‌తో విజృంభించి 138 బంతుల్లో 20 ఫోర్లతో 108 పరుగులు చేశాడు. టి.సుదర్శన్ చక్కటి లైనప్‌తో బ్యాటింగ్ ఆడి 109 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. రోహిత్ వర్మ 85 పరుగులు, ఆర్దిత్ రెడ్డి 70 పరుగులు చేయడంతో కడప జట్టు తొలి రోజు భారీ స్కోరు చేసింది. అనంతపురం జట్టులోని నవదీప్ 3 వికెట్లు, కేహెచ్ వీరారెడ్డి 3 వికెట్లు తీశారు.
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో కర్నూలు –చిత్తూరు జట్లు తలపడ్డాయి, ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 77.4 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయి గణేష్ 98 పరుగులు, భార్గవ్ 54 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని సాయి చరణ్ 4 వికెట్లు, ఘణి 2 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 14 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
తొలి రోజు 461 పరుగులు చేసిన కడప జట్టు

సెంచరీలతో కదం తొక్కిన కడప బ్యాట్స్‌మన్లు

సెంచరీలతో కదం తొక్కిన కడప బ్యాట్స్‌మన్లు

సెంచరీలతో కదం తొక్కిన కడప బ్యాట్స్‌మన్లు

సెంచరీలతో కదం తొక్కిన కడప బ్యాట్స్‌మన్లు