
చెత్తలో కాలిన మందులపై విచారణ
ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని కొత్తపల్లె పంచాయతీ కార్యాలయ ఆవరణలో సోమవారం చెత్తలో కాలిన మందుల వ్యవహారంపై డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ గీత విచారణ చేపట్టారు. జిల్లా అధికారుల ఆదేశాల మరకు కల్లూరు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సుమన్‌తో కలసి ఆమె మంగళవారం కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలోని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులపై ఆరా తీశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరికలు చేశారు. ఈ సంఘటనపై విలేజ్ హెల్త్ క్లినిక్‌లో పనిచేస్తున్న ఏఎన్‌ఎం, ఐదుగురు ఆశా వర్కర్లకు మెమోలు జారీ చేశారు. కాలం చెల్లిన మందుల నిర్వీర్యం కోసం బయోవేస్టేజి నిర్వహణ పద్ధతులు ఉన్నాయని, వాటిని పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందితోపాటు కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.