
కడప–నెల్లూరు ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సోమ వారం కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో కడప, నెల్లూ రు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ప్రా రంభించిన నెల్లూరు జట్టు 69.3 ఓవర్లకు 232 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని తోషిత్ యాదవ్ 116 బంతుల్లో 74 పరుగులు, ఇకాషర్ 44 పరుగులు చేశారు. కడప జట్టులోని చరణ్ 4 వికెట్లు, నాగ కుళ్లాయప్ప 2 వికెట్లు, ధీరజ్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 18 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసింది. ఆ జట్టులోని గురు విఘ్నేష్ 53 పరుగులు, రణధీర్ రెడ్డి 47 పరుగులు చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీసీ స్టేడియంలో..
వైఎస్‌ఆర్‌ఆర్ స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్‌లో అనంతపురం–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లకు 189 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయి చరణ్ 55 పరుగులు, లోహిత్ లక్ష్మీ నారాయణ 33 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టీవీ సాయి ప్రతాప్‌రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. వరుణ్ సాయి నాయుడు 3 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 39 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఆ జట్టులోని రిహాన్ చక్కటి లైనప్‌తో బ్యాటింగ్ చేసి 103 బంతుల్లో 108 పరుగులు చేశాడు. హమీమ్ 38 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని సాయి చరణ్ 3 వికెట్లు, మంజునాఽథ్ 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
ఉత్సాహంగా త్రోబాల్ పోటీలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కడప నగర శివార్లలోని ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఆంధ్రప్రదేశ్ బీ–జోన్ , సీఐఎస్‌సీఈ ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ జోనల్ త్రోబాల్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంతర్జాతీయ త్రోబాల్ క్రీడాకారుడు డి. రేవంత్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు, క్రమశిక్షణ, జట్టు సమన్వయం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలుగా –అండర్–17 విభాగంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కడప , ద్వితీయ స్థానంలో శ్రీ వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ మదనపల్లి,
అండర్–14 విభాగంలో విజేతలుగా స్విస్ రిఫరల్ హాస్పిటల్ స్కూల్ పలమనేరు, రన్నరప్ లు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, కడప, మూడవ స్థానం స్టెమ్ పబ్లిక్ స్కూల్, గుంటూరు నిలిచాయి. పాఠశాల ప్రిన్సిపాల్ అమిత్ సింగ్ ఈ పోటీల్లో విజయం సాధించిన జట్లను అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసమూర్తి, రహమతుల్లా, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్‌లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చెన్నేపల్లిలోనే పాఠశాల కొనసాగించాలి
కడప సెవెన్‌రోడ్స్ : అట్లూరు మండలం చెన్నేపల్లె ప్రాథమిక పాఠశాలను అక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామస్తులు, విద్యార్థులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఎస్.వెంకటాపురం పాఠశాలలోకి తరలించాలన్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు చెన్నేపల్లెలోనే కొనసాగించాలన్నారు. అనంతరం జేసీ అదితిసింగ్‌కు వినతిపత్రం సమర్పించారు.

కడప–నెల్లూరు ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం

కడప–నెల్లూరు ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం

కడప–నెల్లూరు ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం

కడప–నెల్లూరు ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం

కడప–నెల్లూరు ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం