21న ‘యోగాంధ్ర’ను విజయవంతం చేయాలి
కడప సెవెన్‌రోడ్స్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా.. ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సభా భవన్‌లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి, వారిని చైతన్యం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ విశ్వేశ్వర్ నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


