డీఎస్సీకి సర్వం సిద్ధం
కడప ఎడ్యుకేషన్: డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలు ఈ నెల 30 వరకు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 43575 మంది అభ్యర్థులు రాయనున్నారు. రెండు విడతల్లో పరీక్ష నిర్వహణ ఉంటుంది. ఉదయం సెషన్ 9.30 నుంచి 12 వరకు మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. మధ్యలో ఒక రోజు ఇంగ్లిష్ ప్రొిపిసెన్సీ టెట్ నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కూడా రెండు విడతల్లో ఉంటుంది. ఉదయం 11 నుంచి 12.30 వరకు మధ్యాహ్న 4 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.
జిల్లా వ్యాప్తంగా 9 పరీక్షా కేంద్రాల్లో..
డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షకు జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. కడపలో ఆరు, ప్రొద్దుటూరులో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కడపలోని కేఎస్‌ఆర్‌ఎం, కేఓఆర్‌ఎం, కేఎల్‌ఎం, శ్రీనివాస, స్విస్ట్, అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహిస్తారు. వీటిలో 30,586 మంది అభ్యర్థులు రాయనున్నారు. ప్రొద్దుటూరులోని సాయి రాజేశ్వరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెకా్నాలజీ, వాగ్దేవి, సీబీఐటి ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ 12989 మంది అభ్యర్థులు రాయనున్నారు.
పర్యవేక్షణ: పరీక్ష పర్యవేక్షణకు ప్రతి కేంద్రంలో ఒక డిప్యూటీ కలెక్టర్, ఒక డిపార్ట్‌మెంట్ అధికారి, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ నియమించినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. వీరితోపాటు కడపకు కడప డివిజన్ డిప్యూటీ డీఈ రాజగోపాల్‌రెడ్డి, ప్రొద్దుటూరుకు ప్రొద్దుటూరు డిప్యూటీ ఈఓ మీనాక్షిని నియమించినట్లు పేర్కొన్నారు.
జిల్లాలో ఖాళీ పోస్టుల వివరాలు
ఎస్‌ఏ సంస్కృతం – – 1 1
ఎస్‌ఏ తెలుగు 26 – – 26
ఎస్‌ఏ ఉర్దూ 6 – 1 7
ఎస్‌ఏ హిందీ 16 1 1 18
ఎస్‌ఏ ఇంగ్లిషు 78 1 2 81
ఎస్‌ఏ మ్యాథ్స్(టీఎం) 42 – 1 43
ఎస్‌ఏ మ్యాథ్స్(యూఎం) – 1 – 1
ఎస్‌ఏ పీఎస్(టీఎం) 28 – – 28
ఎస్‌ఏ పీఎస్(యూఎం) 2 – 1 3
ఎస్‌ఏ బీఎస్(టీఎం) 49 2 – 51
ఎస్‌ఏ బీఎస్(యూఎం) 2 – – 2
ఎస్‌ఏ ఎస్‌ఎస్(టీఎం) 58 1 1 60
ఎస్‌ఏ ఎస్‌ఎస్(యూఎం) 5 – – 1
ఎస్‌ఏ పీఈ 77 1 4 82
ఎస్‌జీటీ (టీఎం) 219 21 12 252
ఎస్‌జీటీ(యూఎం) 31 7 7 45
మొత్తం 639 35 31 705
గంట ముందే చేరుకోవాలి
నిర్ణీత సమయం కంటే గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఒరిజినల్ హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు వెంట తీసుకుని రావాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులను అను మతించరు. – షేక్ షంషుద్దీన్,
జిల్లా విద్యాశాఖ అధికారి
సబ్జెక్టు ప్రభుత్వ, జెడ్పీ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం
నేటి నుంచి ప్రారంభం కానున్న ఆన్‌లైన్ పరీక్ష
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 6 నుంచి 30 వరకు..
705 పోస్టులకు 43575 మంది దరఖాస్తు
అన్ని ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు
డీఎస్సీకి సర్వం సిద్ధం
డీఎస్సీకి సర్వం సిద్ధం


