ఇండియా పవరేంటో.. శత్రు దేశానికి తెలిసిన క్షణాన..
సైన్యం పొగరేంటో ఉగ్రమూకలకి తెలిసిన సమయాన...
పీఓకేలోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టడమే లక్ష్యంగా
సాగిన ఆపరేషన్ సింధూర్ విజయదరహాసమిది..
ఇండియన్ ఆర్మీని చూసి ప్రతి భారతీయుడు ఉప్పొంగిన రోజు ఇది..
భారత ప్రభుత్వ నిర్ణయం
అభినందనీయం
ఉగ్రవాదాన్ని తుద ముట్టించడంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం,ఉగ్రవాద డెన్లన్నీ ఖల్లాస్ కావడం హర్షణీయం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతి చర్యగా ఈ ఆపరేషన్ విజయవంతం చేసిన భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నా. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. –ఇస్మాయిల్,
దర్గా–ఏ–గఫారియా కన్వీనర్
ఇండియన్ ఆర్మీ సత్తాకు నిదర్శనం
‘ఆపరేషన్ సింధూర్’తో ఇండియన్ ఆర్మీ సత్తా ప్రపంచ దేశాలకు తెలిసింది. జమ్ము–కాశ్మీర్‌లోని పహల్గాంలో టూరిజాన్నీ దెబ్బ తీసేందుకు, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు అతి కిరాతకంగా పర్యాటకులను కాల్చి చంపడం దారుణం. ఉగ్రవాదులను ఏరిపారేయడానికి ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సింధూర్’ బుధవారం తెల్లవారుజామున 25 నిముషాల వ్యవధిలోనే 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఉగ్రమూకల పీచమణచడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ జరిపిన ఈ దాడిపై దేశం యావత్తు గర్విస్తోంది. ఉగ్రమూకల ఆటకట్టించడంలో ప్రధాని మోదీ తీసుకునే చర్యలకు ఇండియా అంతా ఒక్కటై మద్దతు తెలుపుతోంది. – వైఎస్ అవినాష్‌రెడ్డి,
కడప పార్లమెంటు సభ్యులు
ఉగ్రవాదులూ..
తస్మాత్ జాగ్రత్త
ఎల్లప్పుడు శాంతిని కోరుకునే మన దేశంలో అమాయకపు ప్రజ ల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులపై ధీటుగా సమాధానం చెప్పిన భారత సైన్యానికి సెల్యూట్. పహల్గంలో ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చాకచక్యంగా వ్యవహరించి ఉగ్రస్థావరాలపై దాడులు చేసి ఉగ్రవాదులను హతమార్చడం హర్షణీయం.ఇప్పటికై నా పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకోవాలి. కవ్వింపు చర్యలకు పాల్ప డితే భారతీయులు గుణపాఠం నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇరు దేశాల్లోని ప్రజలు కలిసి మెలిసి శాంతియుతంగా ఉండాలా లేదా అని నిర్ణయించు కోవాల్సింది పాకిస్తానే. – వివేకానంద రెడ్డి, 30వ ఆంధ్ర
బెటాలియన్ ఎన్‌సీసీ మాజీ అధికారి
ఉగ్రవాదాన్ని పెకలిద్దాం
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలించాల్సిన అవసరం ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాల దాడి అభినందనీయం. ఆపరేషన్ సింధూర్‌కు మా పూర్తి మద్దతు తెలుపుతున్నాం. యుద్ధం చేసేందుకై నా సిద్ధం. –సయ్యద్ గౌస్‌పీర్,
జిల్లా జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా మంగళవారం అర్థరాత్రి
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా మంగళవారం అర్థరాత్రి
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా మంగళవారం అర్థరాత్రి
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా మంగళవారం అర్థరాత్రి
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా మంగళవారం అర్థరాత్రి
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా మంగళవారం అర్థరాత్రి
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా మంగళవారం అర్థరాత్రి
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా మంగళవారం అర్థరాత్రి